ఎక్స్‌పో 2020 దుబాయ్ నిర్వహించిన ఈ సంవత్సరపు అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, 88% మంది భారతీయ స్పందనదారులు, మహమ్మారి లాంటి అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించేందుకు దేశాలు సన్నిహితంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ వ్యాప్తంగా 24 దేశాలలో 22వేల మంది ప్రజలతో 2021 సర్వేను చేశారు. ఈ అధ్యయనం ద్వారా కోవిడ్–19తో తిరుగులేని రీతిలో మార్చబడిన సెంటిమెంట్లను ట్రాక్‌చేశారు. యుగోవ్ భాగస్వామ్యంతో చేసిన ఈ అధ్యయనం, 2019లో మహమ్మారికి ముందు చేసిన ఇదే తరహా అధ్యయనాన్ని అనుసరించింది.
ఈ అధ్యయనంలో కనుగొన్న కీలక అంశాలకనుగుణంగా, భాగస్వామ్య నేపథ్యంను పలు అధ్యయన స్పందనల వ్యాప్తంగా కనుగొనబడటం జరిగింది. దాదాపు 56% మంది భారతీయులు కమ్యూనిటీల నడుమ అత్యున్నత భాగస్వామ్యాలు అత్యుత్తమ భవిష్యత్‌ను నిర్మించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో, 57% మంది సాంకేతిక జోక్యాలతో యూనిటీ సాధ్యమవుతుందని నమ్ముతున్నారు.
నూతన సాంకేతికతలపై పెరుగుతున్న విశ్వాసం ఎక్స్‌పో 2020 వద్ద భారతదేశపు పెవిలియన్ థీమ్‌ను ప్రతిధ్వనిస్తుంది. ప్రగతి పథంలో భారతదేశం (ఇండియా ఆన్ ద మూవ్) నేపథ్యం దేశపు వృద్ధి సిద్ధాంతంకు ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా సాంకేతిక పురోగతి మరియు ఆవిష్కరణల ద్వారా ఆధునిక భారతం గా గుర్తిస్తున్నారు.
ఎక్స్‌పో 2020 దుబాయ్ డైరక్టర్ జనరల్ మరియు యుఏఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ గౌరవనీయ రీమ్ అల్ హషిమీ మాట్లాడుతూ, ఎక్స్‌పో 2020 ఈ తాజా అంతర్జాతీయ అధ్యయనం అభివృద్ధి చేసింది. దీనిద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అత్యుత్తమ భవిష్యత్ ను ఏ విధంగా తీర్చిదిద్దుకోవచ్చని నమ్ముతున్నారనేది అర్థం చేసుకోవడంలో మాకు సహాయపడుతుంది. తద్వారా మన ప్రాధాన్యతలపై దృష్టి కేంద్రీకరించడమూ వీలవుతుంది. మొత్తంమ్మీద ఈ అధ్యయన ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కలిసికట్టుగా పనిచేయడానికి, మన పరిధిలను విస్తృతం చేయడానికి మరియు ఆలోచనలను మార్పిడి చేసుకోవాలనే సమిష్టికోరికను చూపిస్తుంది.
రెండు నెలల లోపుగానే, ఎక్స్‌పో 2020తమ తలుపులను తెరువనుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సందర్శకులను స్వాగతించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఈ అధ్యయనం ప్రతిబింబించినట్లుగా వైవిధ్యతను ఉపయోగించాలనుకుంటున్నాం. తద్వారా ప్రజలు మరియు భూగోళంకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే నూతన ప్రపంచాన్ని సమిష్టిగా నిర్మించనున్నాం అని అన్నారు.
సాంకేతికత మరియు సుస్థిరత కోణంలో భారతీయులు సానుకూలంగా ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడిస్తున్నప్పటికీ, కేవలం 38% మంది మాత్రమే తమను తాము ఆశావాదులగా భావిస్తున్నారు. ఈ అంశం ప్రతిధ్వనించడానికి భారతదేశంలో యువతకు వృద్ధి అవకాశాలు లేకపోవడం పట్ల ఉన్న ఆందోళన కూడా కారణం; 40% మందికి పైగా దేశంలో కెరీర్‌ను కనుగొనడంతో పాటుగా వృద్ధి అవకాశాల పట్ల ఆందోళనగా ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అంశమే అయినప్పటికీ, ఈ అధ్యయనమే దాదాపు 75%మంది యువ భారతీయులు తమ భవిష్యత్ పట్ల మరింత ఆశతో ఉండటంతో పాటుగా అవకాశాలనూ అన్వేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా స్పందిస్తున్న దాదాపు 50% యువతతో పోల్చినప్పుడు అధికంగానే ఉంది.
ముందుకు వెళ్లేందుకు అతి ముఖ్యమైన అంశాలుగా వేటిని భావిస్తున్నారని అడిగినప్పుడు దాదాపు 37% మంది భారతీయ స్పందనదారులు స్వచ్ఛమైన గాలి, తాగు నీరు, ఆహ్లాదకరమైన ప్రకృతి ప్రాంగణాలు వంటివి అతి ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరికీ అవి తప్పని సరిగా సమానంగా లభించాలని కోరుతుండటమే కాదు 11 సంభావ్య అంశాలలో అతి ముఖ్యమైనవిగానూ భావిస్తున్నారు. సస్టెయినబిలిటీ దిశగా గట్టిగా మొగ్గు చూపుతున్నట్లుగా, ఈ అధ్యయనంలో పది నమ్మకాలలో ఏడింటిలో ఇండియా గ్రీన్ ట్రావెల్‌కు మద్దతునందించే మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉంది వాటిలో, తరువాత దశాబ్దం కోసం చార్జింగ్‌స్టేషన్లు మరియు విద్యుత్ వాహనాలు (ఈవీలు)ను వృద్ధి చేయడం ఉన్నాయి. ఈ అధ్యయనానికి మద్దతునందిస్తూ, 34% భారతీయ స్పందనదారులు పర్యావరణ అనుకూల స్ధానిక రవాణా అయినటువంటి విద్యుత్ కార్లు, బైకులు, స్కూటర్లు మొదలైనవి భూగోళం మీద ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి.
ఈ అధ్యయనంలో పలు అంశాలను శోధించారు. వీటిలో ఆరోగ్యం, సంక్షేమం, సుస్థిర ప్రయాణం, సమర్థవంతమైన ఆహార సరఫరా చైన్స్ వంటి వాటితో సహా గ్రామీణ మరియు నగర కమ్యూనిటీల అభివృద్ధి సైతం ఉన్నాయి. ఈ అంశాలన్నీ కూడా ఎక్స్‌పో 2020 యొక్క కార్యక్రమాలలో దృష్టి సారించిన అంశాలుగా ఉన్నాయి.
ప్రజలు మరియు భూగోళం కోసం మెగా ఈవెంట్ యొక్క ప్రోగ్రామ్ కింద ఎక్స్‌పో 2020లో పాల్గొనబోతున్న దేశాలు, సంస్థలు, భాగస్వాములు, సందర్శకులు ప్రపంచంలోని అతి పెద్ద సవాళ్లకు సంబంధించి భవిష్యత్ పరిష్కారాలను చర్చించేందుకు భాగస్వామ్యం చేసుకోనున్నారు.
కోవిడ్–19 మహమ్మారి ఆరంభమైన తరువాత జరుగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ మెగా కార్యక్రమాలలో ఒకటిగా, ఎక్స్‌పో 2020ను అక్టోబర్ 01,2021 నుంచి 31 మార్చి 2022 వరకూ నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులను నూతన ప్రపంచ రూపకల్పన కోసం ఇక్కడకు ఆహ్వానిస్తున్నారు. మానవ సృష్టి. ఆవిష్కరణ, వృద్ధి, సంస్కృతిని ఆరు నెలల పాటు జరిగే వేడుకలలో అన్వేషించండి.