Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం తొలగింపు!!

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (12:05 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్... మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలపై సమీక్ష చేస్తున్నారు. ఇందులోభాగంగా, ట్రంప్ ప్రభుత్వం చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. చైనాకు చెందిన టిక్​టాక్​, విచాట్​ యాప్​లపై విధించిన నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎత్తివేశారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.
 
కరోనా మొదటి దశ మహమ్మారి ప్రబలిన వెంటనే చైనాకు వ్యతిరేకంగా అమెరికా అనేక నిర్ణయాలను తీసుకుంది. వీటిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పునఃసమీక్ష చేపట్టినట్లు వైట్‌హౌస్ వర్గాలు ధృవీకరించాయి. టిక్ టాక్ యాప్‌తోపాటు విచాట్ తదితర యాప్‌లలో భద్రతాపరమైన అంశాలను వాణిజ్య విభాగం క్షుణ్ణంగా పరిశీలించిన మీదట వాటిపై నిషేధం ఎత్తివేశారు. 
 
నిజానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న అనేక నిర్ణయాలను జో బైడెన్ అధ్యక్షుడిగాఎన్నికైన తర్వాత రద్దు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే కోవలోనే టిక్‌టాక్‌, విచాట్‌ యాప్స్‌పై విధించిన నిషేధాన్ని కూడా బైడెన్‌ ఎత్తివేశారు. అమెరికా విదేశాంగ వాణిజ్య విభాగం టిక్‌టాక్‌పై భద్రతపరమైన అంశాలను తాజాగా వాణిజ్య విభాగం ఓ కన్నేసి ఉంచనుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments