Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉదయం ప్రియుడితో, రాత్రి భర్తతో.. ఆ విషయం బయటకు తెలియడంతో?

Advertiesment
ఉదయం ప్రియుడితో, రాత్రి భర్తతో.. ఆ విషయం బయటకు తెలియడంతో?
, బుధవారం, 9 జూన్ 2021 (21:21 IST)
ఆమెకు పెళ్ళీడుకొచ్చిన కొడుకు ఉన్నాడు. అయితే కోర్కెలు మాత్రం తగ్గలేదు. భర్తతో చేస్తున్న సంసారం జీవితం సరిపోక ఒక ప్రియుడిని సెట్ చేసుకుంది. అతనితో ఉదయం.. రాత్రయితే భర్తతో.. ఇలా కొన్ని సంవత్సరాల పాటు తన కోర్కెలను తీర్చుకుంది. చివరకు బండారం బయటపడడంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది.
 
కర్ణాటకలోని ఉడిపికి చెందిన భాస్కర్ శెట్టి ప్రముఖ వ్యాపారవేత్త. ఉడిపితో పాటు విదేశాల్లో కూడా భాస్కర్ శెట్టికి అనేక హోటళ్ళు ఉన్నాయి. భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి అలియాస్ రాజీ. వీరికి నవనీత్ శెట్టి కొడుకు ఉన్నాడు. అతని వయస్సు 23యేళ్ళు. భాస్కర్ శెట్టితో సన్నిహితంగా ఉండేవాడు ప్రముఖ జ్యోతిష్యుడు నిరంజన్ భట్.
 
భాస్కర్ శెట్టి ఇంటికి తరచూ వచ్చి వెళుతుండేవాడు. భాస్కర్ శెట్టికి జ్యోతిష్యం చెబుతూ ఉండేవాడు. ఇలా రాజేశ్వరికి బాగా దగ్గరయ్యాడు. ఆమె అందంగా ఉండడంతో ఆమెకు వల వేశాడు. ఆ వలలో పడిపోయింది రాజేశ్వరి శెట్టి. గత కొన్ని సంవత్సరాలుగా వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది. 
 
భర్త వ్యాపారం నిమిత్తం బయటకు వెళితే రాజేశ్వరి జ్యోతిష్యుడి గెస్ట్ హౌస్‌కు వెళ్ళి ఎంజాయ్ చేసేది. ఇలా వీరి మధ్య అక్రమ సంబంధం కొడుకు నవనీత్ శెట్టికి తెలిసిపోయింది. అయితే కొడుక్కి మరో రకంగా చెప్పింది తల్లి. తండ్రి ఎవరెవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని చెప్పింది.
 
అంతేకాదు ఆయన ఆస్తి కూడా ఎవరికో రాసేటట్లు ఉన్నారని.. మనకు ఏమీ రాదని అతన్ని రెచ్చగొట్టింది. దీంతో ముగ్గురు కలిసి తండ్రి హత్యకు ప్లాన్ చేశారు. అతి దారుణంగా ఇంట్లోనే చంపేసి దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ అసలు విషయం బయటపడింది. నిందితులు ముగ్గురికి యావజ్జీవ శిక్ష పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూన్ 14 తర్వాత అన్‌లాక్ ప్రక్రియ.. ఏయే రాష్ట్రాల్లో తెలుసా?