Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు నెలల పాప రాయిగా మారుతోంది... అదెలా సాధ్యం?

Webdunia
శనివారం, 3 జులై 2021 (22:16 IST)
Baby
ఐదు నెలల పాప రాయిగా మారుతోంది. ఇందుకు కారణం ఆ పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇక చలనం లేకుండా మారిపోతుందని డాక్టర్లు చెప్పేశారు. దీంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యూకే హేమెల్ హెంప్‌స్టెడ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన అలెక్స్‌, దవే దంపతుల ఐదు నెలల వారి చిన్నారి బేబీ లెక్సి రాబిన్స్‌ ప్రస్తుతం అత్యంత అరుదైన సమస్యను ఎదుర్కొంటుంది. ఈ చిన్నారి శరీరం రాయిలా మారుతుంది. 
 
అలెక్స్‌, దవే దంపతులకు లెక్సి ఈ ఏడాది జనవరి 31న జన్మించింది. ఐదు నెలల వరకు బాగానే ఉన్నప్పటికి.. ఆ తర్వాత లెక్సి శరీరంలో మార్పులు రాసాగాయి. పాప బొటనవేలు, కాలి బొటనవేలులో పెద్దగా చలనం లేదని గుర్తించారు లెక్సి తల్లిదండ్రులు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు నెల రోజుల పాటు చిన్నారిని పరీక్షించిన వైద్యులు లెక్సి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా (ఎఫ్‌ఓపీ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు.
 
20 లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ఈ చిన్నారికి వచ్చింది. ఈ వ్యాధి కారణంగా పాప శరీరంలో కండరాలు, వాటిని కలిపి ఉంటే టెండాన్స్‌, లిగిమెంట్‌ స్థానంలో ఎముకలు ఏర్పడతాయట. 
 
అంతేకాకుండా అస్థిపంజరం లోపల పెరగాల్సిన ఎముకలు.. దానికి విరుద్ధంగా వెలుపల ఏర్పడి పెరుగుతూ కదలికలు లేకుండా అడ్డుకుంటాయట. అంటే సర్టెయిన్ ఏజ్ వచ్చేసరికి పాప శరీరం రాయిలా కదలకుండా మారుతుందన్నమాట. అత్యంత అరుదైన ఈ వ్యాధి పేరు ‘లెక్సి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా’. షార్ట్‌గా ‘ఎఫ్‌ఓపీ’ అని పిలుస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments