Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతరిక్షంలో అద్భుతం: మెక్సికో సముద్రంలో మంటలు

Advertiesment
Eye of fire
, శనివారం, 3 జులై 2021 (17:47 IST)
Mexico
మెక్సికో సమీపంలోని మహాసముద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. నారింజ రంగులో మంటలు చెలరేగాయి. వృత్తాకారంలో చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు సముద్రంలోకి చేరుకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
 
పశ్చిమాన సముద్రపు ఉపరితలపై శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని రాష్ట్ర చుమురు సంస్థ పెమెక్స్ వెల్లడించింది. సముద్రపు నీటి అడుగున పైపులైన్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. 
 
మంటలను ఆర్పడానికి సుమారు ఐదు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. గ్యాస్ లీక్ కావడం వల్ల.. ప్రాజెక్టు కంపెనీ ఉత్పత్తిపై ప్రభావం చూపించలేదని, 10.30గంటలకు మంటలు పూర్తిగా ఆరిపోయాయని కంపెనీ వెల్లడించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలిస్తామని తెలిపింది. 
 
అయితే అంతరిక్షంలో న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్ ఢీ కొట్టుకున్నాయి. సుమారు 900 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని పరిశోధకులు తొలిసారిగా గమనించారు. 
 
జూన్ 5 2020 నుంచి జూన్ 15 2020 మధ్యలో ఏకంగా సుమారు పది సార్లు ఢీ కొట్టుకున్నాయని ఈ సందర్భంగా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ అరుదైన రెండు దృగ్విషయాలు ఢీ కొట్టుకోవడం తో బైనరీ వ్యవస్థల మూలాలు, అవి ఎంత తరచుగా విలీనం అవుతాయనే విషయాలను తెలుసుకోవడంలో, ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాషతోనే సంస్కృతి, సంస్కృతితోనే సమాజం: ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌