Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంతరిక్షంలోకి తొలిసారి తెలుగు మూలాలు ఉన్న మహిళ...

Advertiesment
అంతరిక్షంలోకి తొలిసారి తెలుగు మూలాలు ఉన్న మహిళ...
, శుక్రవారం, 2 జులై 2021 (12:20 IST)
అంతరిక్షంలోకి తొలిసారి తెలుగు మహిళ అడుగుపెట్టనుంది. ఈ నెల 11వ తేదీన అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్షంలోని అంతరిక్ష వాహక నౌకను ప్రయోగిచనుంది. ఇందులో తొలిసారి నలుగురు ప్రయాణికులు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నలుగురులో ఒకరు తెలుగు మూలాలు ఉన్న మహిళ కావడం గమనార్హం. ఈమె వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో అడుగుపెట్టనున్నారు. 
 
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వర్జిన్ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపడుతుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఈ కంపెనీకు జూన్ 25వ తేదీన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్సును జారీచేసింది. 
 
దీంతో ఫ్లైట్ ఈ నెల 11వ తేదీ న్యూ మెక్సికో నుంచి అంతరిక్షంలోకి బయలుదేరి వెళ్లనుంది. ఈ తరహా ప్రయోగం చేపట్టడం, ప్రయాణికులను తీసుకెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నలుగురు ప్రయాణికుల్లో శిరీష బండ్ల కాగా, చీఫ్ అస్ట్రోనాట్ ఇన్‌స్ట్రక్టర్లు బెత్ మోసెస్, లీడ్ ఆపరేషన్ ఇంజనీర్ కాలిన్ బెన్నెట్‍, గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సస్‌లు ఉన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ క్షణమైనా కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. ఆ రాష్ట్రాలకే ప్రాధాన్యం