రైతులకి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. రూ.15 లక్షల రుణం

Webdunia
శనివారం, 3 జులై 2021 (22:07 IST)
రైతులకి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయడానికి, వారికి ఆర్థిక మద్దుతు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్స్ లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ స్కీమ్ (FPO) కూడా ఒకటి.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ స్కీమ్ ద్వారా కేంద్రం రూ.15 లక్షల రుణం అందిస్తుంది. రైతులు అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మోదీ సర్కార్ రూ.15 లక్షల ఆర్థిక మద్దతు అందిస్తుంది. ఇది రైతులకి కాస్త రిలీఫ్ ని ఇస్తుంది.
 
కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ స్కీమ్‌ను ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది దీనిలో చేరారు కూడా. ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌ స్కీమ్ కింద రూ.15 లక్షలు పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక ఆర్గనైజేషన్‌గా ఏర్పడాలి.
 
కంపెనీ చట్టం కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ విత్తనలు, మందులు, ఎరువులు మొదలైన వాటిని రైతులకు విక్రయించొచ్చు. ఒక్కో ఎఫ్‌పీవోకు మోదీ సర్కార్ రూ.15 లక్షల రుణం అందిస్తుంది. దీని ద్వారా ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించొచ్చు. కేంద్రం 2023-24 నాటికి 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments