Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్‌ఫుడ్స్ మాత్రమే ఆహారం.. కంటిచూపు, వినికిడి శక్తి మటాష్

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (19:27 IST)
ఫాస్ట్‌ఫుడ్స్ మాత్రమే ఆ పిల్లాడు ఇష్టపడి తింటుంటేవాడు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వంటివి తీసుకునేవాడు కాదు. దీంతో ఆ పిల్లాడు.. కంటిచూపును, వినికిడి శక్తిని శాశ్వతంగా కోల్పోయాడు. ఈ ఘటన టెన్నిసీ రాష్ట్రంలోని బ్రిస్టల్ కౌంటీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, బ్రిస్టల్‌కు చెందిన ఓ పిల్లాడు(14) తొలుత అలసిపోయినట్లు అనిపిస్తోందని స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లు తొలుత షాకయ్యారు. 
 
ఎందుకంటే అతని శరీరంలో ఎర్రరక్త కణాలు సాధారణం కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇతర విటమిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే ఎముకల పటిష్టత కూడా తగ్గిపోయింది. దీంతో సదరు టీనేజర్‌కు మాక్రోటిక్ అనీమియా అనే వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
పండ్లను, కూరగాయలను పక్కనబెట్టి.. ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రెడ్డు, చిప్స్, శుద్ధి చేసిన మాంసం, వేపుళ్లు మాత్రమే తినేవాడని వైద్యులు తెలిపారు. దీని ప్రభావంతో కంటి చూపు, వినికిడి శక్తిని కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments