Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ నాయకులతో కేటీఆర్ సమావేశం... ఎందుకు?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:59 IST)
రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులతో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు.

రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన ఈ సమావేశంలో సమీక్షించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో పార్టీ కమిటీల ఏర్పాటును ఈనెల ఆరో తేదీ నాటికి పూర్తి చేయాలని సూచించారు. స్థానిక కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో సమన్వయం చేసుకొని ఎమ్మెల్యేలు కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

స్థానిక బస్తీలు, డివిజన్ కమిటీల ఏర్పాటును సైతం ఈ ఆరవ తేదీ లోపల పూర్తి చేయాలని కేటీఆర్ తెలిపారు. ఈ కమిటీలతో పాటు ప్రతి బూత్ స్థాయికి ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని కూడా సూచించాలని, వీరికి పార్టీ నుంచి శిక్షణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికి సంబంధించి బూత్ స్థాయి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు జాబితాను ప్రత్యేకంగా పార్టీకి అందించాలని కేటీఆర్ కోరారు. ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ల ద్వారా జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ శ్రేణులకు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు చేరవేసేందుకు ఈ డిజిటల్ మీడియా సైన్యం పనిచేస్తుందని తెలిపారు.

ప్రతి ఎన్నిక ఎన్నికకు సామాజిక మాధ్యమాల ప్రభావం పెరుగుతున్నదని దీన్ని ప్రతి ఎమ్మెల్యే, నాయకుడు గుర్తించాలన్నారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 
 
ఈ సమావేశంలో రానున్న పురపాలక ఎన్నికలకు సంబంధించిన పార్టీ కార్యాచరణను కేటీఆర్ వివరించారు. జిహెచ్ఎంసి పరిధిలోని మున్సిపాల్టీలు కార్పొరేషన్ల ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీపరంగా తీసుకోవాల్సిన కార్యాచరణ పైన స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పార్టీ సీనియర్ నాయకులతో చర్చించారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో పది పురపాలక సంఘాలకు ఎన్నికలు ఉన్నాయన్న కేటీఆర్, ఇలా ఒక నియోజకవర్గంలో ఒకటికి మించి పురపాలక సంఘాలకు ఎన్నికలు ఉన్నచోట్ల పార్టీ పార్టీ నుంచి ఇన్చార్జి లను నియమించుకొని ఆయా ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ అమలు, ఎన్నికల సమన్వయాన్ని చూసుకుంటామన్నారు.

రంగారెడ్డి లోనూ పలు పురపాలక సంఘాల ఎన్నికల సమన్వయం కోసం... తమ నియోజకవర్గాల్లో ఎన్నికలు లేని నగర ఎమ్మెల్యేలను, ఇన్చార్జిలుగా నియమిస్తామన్నారు. నగర ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లను ఆయా పురపాలక సంఘాల ఎన్నికల ఇన్చార్జిలుగా ఒకటి రెండు రోజుల్లో పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు ప్రకటిస్తారని కేటీఆర్ తెలిపారు.

పార్టీ తరఫున నియమించబడే ఇన్చార్జిలు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సమన్వయం చేసుకొని పురపాలక సంఘాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఈ సమావేశంలో కేటిఆర్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments