రోజుకో కప్పు పండ్లను తీసుకోవడం ద్వారా అధిక బరువును దూరం చేసుకోవచ్చు. పండ్లలో పొటాషియం పుష్కలంగా వుంటుంది. తద్వారా రక్తపోటును నియంత్రించవచ్చు. కిడ్నీల్లో రాళ్లను నిరోధించడంలో పండ్లు భేష్‌గా పనిచేస్తాయి. ఇందులోని లో-కేలరీలు అధిక బరువును నియంత్రిస్తాయి.
అలాగే పైనాపిల్ పండ్లను రోజూకు అరకప్పు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. పైనాపిల్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దంత సమస్యలను నయం చేస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం సక్రమంగా లేని పక్షంలో పైనాపిల్‌ను తీసుకోవడం మంచి టానిక్‌లా పనిచేస్తుంది. తద్వారా రక్త సంబంధిత రుగ్మతలను ఇది దూరం చేస్తుంది. మహిళలకు రుతు సంబంధిత ఇబ్బందులను అనాసపండు దరిచేరనివ్వదు.
ఇంకా దానిమ్మ పండు తప్పకుండా రోజూవారీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా దగ్గు దూరమవుతుంది. తరచూ వేధించే అనారోగ్య సమస్యలుండవు. రోజుకో అరటి పండు తీసుకుంటే పైల్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు.
అందుకే రోజుకు 9 గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోయేవారు రోజుకో అరటి పండును తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఎ, సి పుష్కలంగా గల పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.