అరటి పండును తిని.. తొక్కే కాదాని పారేస్తుంటాం. కానీ అరటి తొక్కలో వుండే యాంటీయాక్సిడెంట్ గురించి చాలామంది తెలియకపోవచ్చు. ఇందులోని ల్యూటిన్ కళ్ళకి పోషకాలను అందిస్తుంది. అంతేగాకుండా అరటి తొక్కను బాగా కడిగి.. ఉడికించి.. ఆ నీటిని తాగినట్లైతే ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అరటిపండు తొక్కల్లో మన భావోద్వేగాలను నియంత్రించే సెరిటోనిన్ నిల్వలు అధిక మొత్తంలో ఉంటున్నాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడి అయ్యింది. ఈ తొక్కలో ఉండే కొన్ని రసాయనస్రావాలు కంటి రెటీనా కణాల్ని పునరుజ్జీవింప చేస్తున్నాయని గుర్తించారు. సాధారణంగా మెదడులో సెరిటోనిన్ నిల్వలు తగ్గితే మనకు డిప్రెషన్ తప్పదు. ఇది తగ్గకుండా వుండాలంటే.. ఇక అరటి తొక్కలే దివ్యౌషధంగా పనిచేస్తాయట.