Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాజుసీసాలో మూడు వంతుల తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వేసి...

గాజుసీసాలో మూడు వంతుల తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వేసి...
, శనివారం, 1 జూన్ 2019 (22:46 IST)
ఎండు ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే తేనెలో ఎండు ఖర్జూరాలను వారంపాటు నానబెట్టి తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్త హీనత ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది. అండు ఖర్జూరాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. ఒక గాజుసీసాలో మూడు వంతుల తేనె, ఒక వంతు గింజ తీసిన ఎండు ఖర్జూరాలను వేయాలి. వీటిని తేనెలో బాగా కలిపి మూతపెట్టి వారం రోజులు కదలకుండా ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున ఈ ఖర్జూరాలను తినడం వల్ల శృంగార సమయంలో వచ్చే అలసటను దూరం చేస్తుంది.  
 
2. తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జబ్బుల బారిన పడటం తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందొచ్చు.
 
3. ఎండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ మిశ్రమంలోని యాంటీ బయాటిక్ గుణాల వల్ల గాయాలు త్వరగా మానతాయి.  చిన్నారులు చదువుల్లో చురుగ్గా మారతారు.
 
4. తేనె, ఖర్జూర మిశ్రమంలో కాల్షియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ మిశ్రమం రక్త హీనతను తగ్గించి, ఎముకలను బలంగా మారుస్తుంది. చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 
 
5. మలబద్ధకంతో బాధపడే వారు వారంలో మూడు రోజులు ఖర్జూరాలను తింటే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా సరిగా జరిగేలా మెరుగుపరుస్తుంది.
 
6. ఖర్జూరాల్లో కొలస్ట్రాల్ ఉండదు కాబట్టి ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరాల్లో గ్లూకోజ్, ప్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందచేస్తాయి.
 
7. ఖర్జూరాల్లో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇవి కంటిచూపుని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల బీపీని కంట్రోల్ చేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆల్‌బుకరా పండ్లలో ఆరోగ్యప్రయోజనాలు...