మనం చాలా వరకు అన్ని ఆహారపదార్థాలను ఫిజ్‌లో పెడుతుంటాము. ఫ్రిజ్‌లో వాటిని పెట్టడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయని అంటుంటారు. అయితే అరటిపండ్ల విషయంలో మాత్రం అలా పెట్టకూడదని చెబుతుంటారు. అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెట్టి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి.
దీనిపై ఆహారనిపుణులను వివరణ కోరగా అరటిపండ్లను ఎలా తీసుకున్నా సమస్య ఏమీ లేదని అంటున్నారు. అన్ని పండ్ల వలె అరటిపండ్లను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చని తెలిపారు.
అయితే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అరటిపండ్ల తొక్క రంగు మారుతుందని, వీటిని తినడం అంతగా నచ్చదని అంటున్నారు. అందుకే ఫ్రిజ్‌లో పెట్టారని చెబుతున్నారు. అంతేగానీ ఫ్రిజ్‌లో పెట్టిన పండ్లు తమ గుణాలను ఏమాత్రం కోల్పోవని, అంతే ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.