Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరటిపండు, బొప్పాయి పేస్ట్ చేసి..?

Advertiesment
hair pack
అరటిపండులోని తేమగుణం వలన వెంట్రుకలు ఊడవు. అంతేకాదు, అరటిపండ్లలోని విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు శిరోజాలను వృద్ధిచేయడమే కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి. అలాంటి కొన్ని అరటిపండు హెయిర్ మాస్కులు మీకోసం..
 
అరటిపండు, బొప్పాయి ప్యాక్:
ఈ మాస్కులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రాసుకోవడం వలన జుట్టుకు మెరుపు రావడమే కాదు వెంట్రుకలు పటిష్టంగా ఉంటాయి. బాగా పండిన అరటిపండును కచ్చాపచ్చాగా చేయాలి. దాంట్లో బాగా పండిన 4 బొప్పాయి ముక్కలను వేయాలి. ఈ రెండింటిని కలిపి గుజ్జులా చేయాలి. ఇందులో 2 స్పూన్ల తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. 
 
మాడు మీద, తలకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. వెంట్రుకలను ఒక చోటుకు చేర్చి ముడివేసి తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. కాసేపటి తరువాత గోరువెచ్చని నీళ్ళతో వెంట్రుకలను బాగా కడిగేసుకుని షాంపూతో తలస్నానం చేయాలి.   
 
అరటిపండు, ఆలివ్ ఆయిల్ ప్యాక్:
ఈ మాస్కు వలన దెబ్బతిన్న వెంట్రుకలు చక్కబడుతాయి. ఒకే ఒక మెత్తటి అరటిపండు తీసుకుని అందులో 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలుపుకుని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ పేస్ట్‌ను బ్రష్ సహాయంతో వెంట్రుకలకు రాసుకుని తలకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 20 నిమిషాల తరువాత తలను షాంపూతో శుభ్రంగా రుద్దుకుని తలస్నానం చేయాలి. ఆలివ్ నూనెకు బదులు కొబ్బరి నూనె కూడా వాడొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గులాబ్‌జామ్ కుల్ఫీ...?