బ్రౌన్ కలర్ అరటిపండ్ల గురంచి తెలిస్తే అస్సలు వదలరు..

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (20:14 IST)
అరటి. ప్రపంచంలో ఎక్కువగా తినే పండు అన్ని రకాల పండ్లు కొన్ని సీజన్లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతిరోజు దొరుకుతాయి. అలా దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటిపండు. అరటిపండు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. 
 
అరటిపండ్లలో చాలా రకాలు ఉంటాయి. గ్రీన్ కలర్, పసుపు కలర్, మచ్చల అరటి, బ్రౌన్ కలర్ అరటి. అయితే వీటిలో ఒక్కోరంగు అరటిపండు ఒక్కో విధంగా ఉపయోగపడుతుందట. బాగా పండిన లేదా రంగుమారిన అరటిపండ్లను బ్రౌన్ కలర్ అరటిని అస్సలు పడేయద్దు అంటున్నారు వైద్య నిపుణులు. వాటిని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందట.
 
బ్రౌన్ కలర్ అరటిపండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని జ్యూస్ చేసుకొని తాగడం కానీ, బనానా బ్రెడ్‌గా చేసుకుని తింటే మంచిదని చెబుతున్నారు. ఇక గ్రీన్ కలర్ అరటిపండ్లు, షుగర్ పెరగకుండా కాపాడతాయి. ఈ కలర్ అరటిపండ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ పరిణామం నెమ్మదిగా పెరుగుతాయి. ఇక పసుపు రంగు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల చాలా రోగాలు మనకు సోకవట. ఇవి చాలా సులభంగా జీర్ణమై బలాన్ని ఇస్తాయట.
 
మచ్చలు ఉన్న అరటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా ఉండే అరటిపండు చాలా రుచికరంగా ఉంటుంది. కానీ మిగతా అరటిపండ్ల కంటే వీటిలో పోషకాలు చాలా తక్కువట.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆమె నన్నలా హత్తుకోగానే నా ప్యాంటూచొక్కా తడిసిపోయింది... ఎందుకని?