రేచీకటి పోవాలంటే ఇలా చేయండి...

బుధవారం, 15 మే 2019 (18:59 IST)
కాలీఫ్లవర్‌ని చాలా మంది ఇష్టపడరు. ఇది రుచికరంగా ఉండకపోయినా చాలా పోషక విలువలు అందులోదాగివున్నాయి. దీన్ని తినడానికి ఇష్టపడని వారు నచ్చే రీతిలో కూరను తయారు చేసుకుని తినొచ్చు. కాలీఫ్లవర్‌ని మసాలా దట్టించి చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. 
 
తాజా కాలీఫ్లవర్ రసాన్ని రోజూ ఒక గ్లాసు చొప్పున మూడు మాసాల పాటు త్రాగితే కడుపులోని కురుపులు తగ్గిపోతాయి, దంతాలు చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గిపోతుంది. కాలీఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్‌, బ్రెస్ట్‌, ఒవేరియన్‌, బ్లాడర్‌ క్యాన్సర్‌ వంటి పలు రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. 
 
కాలీఫ్లవర్‌ ఆకుల రసం రోజూ ఒక కప్పు తాగితే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు వంటివి రావు. గర్భిణి స్త్రీలు ఈ రసం త్రాగితే పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. కాలేయం పనితీరును కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది. 
 
కాలీఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్‌, థయోసయనేట్స్‌ లివర్‌ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్‌ 'సి' ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నుంచి రక్షణనిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వేసవికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి....