Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధిమార్చుకోని తాలిబన్ తీవ్రవాదులు : మహిళల వాయిస్ బంద్

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (17:06 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత శాంతిపలుకులు పలికిన తాలిబన్ తీవ్రవాదులు.. ఆచరణలో మాత్ర తమ బుద్ధిని మార్చుకోలేదు. ఫలితంగా తమ కఠినమైన షరియా చట్టాలను గుట్టుచప్పుడు కాకుండా అమలు చేస్తున్నారు. సంగీతం లేదా పాటలు,  టీవీలు, రేడియో ఛానళ్లలో ఆడవాళ్ల వాయిస్‌ని బ్యాన్ చేయాలని కాందహార్‌లోని టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లను తాలిబన్ ఆదేశించింది. 
 
వాస్తవానికి తాము పూర్తిగా మారిపోయామని, ఒకప్పటిలా మహిళల పట్ల వివక్ష చూపించం.. మహిళలు పని చేసుకోవచ్చు.. మహిళలు చదువుకోవచ్చు.. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం అంటూ మీడియా సమావేశాల్లో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు వారు అంగీకరించడం లేదు. 
 
కాగా, ఆగస్టు 15వ తేదీన తాలిబన్లు అప్ఘానిస్తాన్‌ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పలు మీడియా సంస్థలు తమ ఫీమేల్ (ఆడవాళ్లు) యాంకర్లను తొలగించిన కొద్ది రోజుల్లోనే తాలిబన్ నుంచి ఈ ఆదేశాలు రావడం గమనార్హం. ఇక,పలువురు మీడియా సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు కూడా ఇటీవల అప్ఘానిస్తాన్ వదిలి పారిపోయినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌కి వెళ్ళాం కదా.. అంతేలే.. కీర్తి సురేష్ హగ్గులు, కిస్సులు.. (video)

ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్న కోలీవుడ్ దర్శకుడు!!

సపోర్టు చేసిన వారిని మర్చిపోతే నీ సక్సెస్ ఎందుకు పనిరాదు : వరుణ్ తేజ్ (Video)

పుష్ప-2 కోసం కిస్సిక్‌ సాంగ్‌ చేసిన డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల

తెలుగు సంఘాల ఫిర్యాదుతో పోలీసుల కేసు.. పరారీలో నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments