ఆమెకు పెళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. శారీరకంగా భర్త ఎక్కువగా దగ్గర కాకపోవడం ఆమెను బాగా కుంగదీసింది. అందుకే ఆమె వేరే వ్యక్తికి దగ్గరైంది. ప్రియుడే సర్వస్వంగా భావించింది. ప్రతి నిమిషం మధురక్షణమే అంటూ అతనితో గడిపేది. కానీ చివరకు...
విజయవాడ న్యూరాజరాజేశ్వరి ప్రాంతానికి చెందిన సుబ్బారావు కాంట్రాక్టర్. భార్య స్థానికంగా బ్యాంకులో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సాఫీగానే సాగిపోతున్న సంసారం. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు.
అయితే భర్త తరచూ తన దగ్గరకు రాకపోవడంతో బాగా ఫీలయ్యేది భార్య. ఈ క్రమంలోనే తన ఇంటికి సమీపంలో ఉన్న దిలీప్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వయస్సులో ఎంతో పెద్దదైన ఆమె ఆ యువకుడి మోజులో పడిపోయింది.
భర్తకు, కుటుంబ సభ్యులకు ఏమాత్రం అనుమానం రాకుండా శారీరకంగా ఇద్దరూ కలిసేవారు. యువకుడితో కలిసి ప్రతిక్షణం ఎంతో మధుర క్షణాలంటూ చెబుతూ ఉండేది ఆ వివాహిత. తనను పెళ్ళి చేసుకోవాలని కూడా గత 15 రోజుల నుంచి ఒత్తిడి తెచ్చింది.
తనకు బ్యాంకు ఉద్యోగం ఉందని.. వేరుగా ఉండి హాయిగా ఉందామని కూడా ప్రియుడికి చెప్పింది. కానీ డిగ్రీ మాత్రమే చదివిన దిలీప్ ఇంట్లో వారు ఒప్పుకోరని తెగేసి చెప్పాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తను మోసం చేశానన్న విషయాన్ని ఒక లేఖలో రాస్తూ ప్రియుడికి సారీ అంటూ లేఖలో పేర్కొంది వివాహిత.