Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ సిగరెట్ తాగాలంటే తప్పనిసరిగా 100 ఏళ్లు నిండాలి...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:58 IST)
సిగరెట్లు కాల్చవద్దని ప్రభుత్వాలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ఎవరూ వాటిని పట్టించుకోరు. పైగా ప్రతి ఏడాది వాటి ధరలు పెంచినా కూడా విక్రయాలు కూడా బాగా పెరుగుతూనే ఉంటాయి. మన దేశంలో పొగ త్రాగడానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వయస్సు 18 ఏళ్లు, చాలా దేశాల్లో కూడా ఇదే వయసు నుండి పొగ త్రాగడానికి అనుమతిస్తారు.
 
అయితే అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఈ వయస్సు 21 ఏళ్లుగా ఉంది. అయితే అక్కడి ప్రభుత్వం ఈ వయో పరిమితిని వందేళ్లకు పెంచాలనే యోచనలో ఉంది. దీని కోసం అక్కడి చట్టసభ ప్రతినిధి అయిన రిచర్డ్ క్రీగన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
 
ఈ బిల్లు ప్రకారం చట్టరీత్యా సిగరెట్ త్రాగే వారి వయస్సు వచ్చే ఏడాదిలో 30 ఏళ్లకు, 2021లో 40 ఏళ్లకు, 2022లో 50 ఏళ్లకు, 2023లో 60 ఏళ్లకు చివరగా 2024లో 100 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇప్పటికే హవాయిలో సిగరెట్ అమ్మకాలపై కఠిన నిబంధనలు ఉన్నాయని, అయినా కూడా విడతల వారీగా తమ దేశం నుంచి సిగరెట్‌ను పూర్తిగా తరిమివేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు క్రెగన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments