Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో మరో ఘనత... జీశాట్ 31 సక్సెస్...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:49 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 31 ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుండి విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు నింగిలోకి వెళ్లిన ఏరియానా రాకెట్ 42 నిమిషాల్లోనే నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 
 
విజయవంతంగా నింగిలోకి ఎగిరిన ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. కాగా జీశాట్ 31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్-4 ఉపగ్రహాన్ని కూడా అందులో చేర్చారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేసారు. 2535 కిలోలు ఉన్న ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సమాచార సేవలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
 
అత్యంత సమర్థవంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థను కలిగి ఉన్న జీశాట్ 31 ఇస్రో సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్‌శాట్, జీశాట్‌లకు అత్యాధునిక రూపంగా నిపుణులు పరిగణిస్తున్నారు. ఈ ఉపగ్రహం భారతీయ భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని అందిస్తుంది. ఇది వరకే భూస్థిర కక్ష్యలో గల ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఈ ఉపగ్రహం అదనపు సమాచార సేవలను అందించనుంది.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments