బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో ముందుండే రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యే భవానీ సింగ్ రజావత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏకంగా ఒక ప్రభుత్వాధికారిని దూషిస్తూ బెదిరింపులకు దిగారు.
లడ్‌పురా ఎమ్మెల్యే అయిన రజావత్.. కోట జిల్లాలోని భమాషా రైతు మార్కెట్‌ను బుధవారం సందర్శించారు. ధాన్యాల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయంటూ మార్కెట్ అధికారులను పిలిపించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాజస్థాన్ సహకార మార్క్‌ఫెడ్ డిప్యూటీ రిజిస్ట్రార్ అజరుసింగ్ పన్వార్ రజావత్‌ను వేచి వుండేలా చేశారు. దీంతో అక్కడికి చేరిన పన్వార్‌ను చూసి రజావత్ కోపోద్రేక్తుడయ్యారు. ఆయనపై తన నోటిదురుసును ప్రదర్శించారు.
'నేను కొడితే నీ ప్యాంటు తడుపుకుంటావ్' అని బెదిరిస్తూ పన్వార్‌ను దూషించారు. అయితే రైతుల తరఫున తన గొంతు వినిపిస్తానని ప్రభుత్వాధికారిపై దూషణను అనంతరం తన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సమర్థించుకోవడం గమనార్హం.