మొబైల్ ఫ్లిప్ కవర్లో ఏకంగా 2997 గ్రాముల బంగారం బిస్కెట్లను దాచిపెట్టి.. సరికొత్త స్మగ్లింగ్‌కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పసిడి అక్రమ రవాణాకు వెరైటీ స్మగ్లింగ్‌ను పోలీసులు కనుగొన్నారు.
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా జితేంద్ర సోలంకి అనే వ్యక్తి పసిడిని అక్రమంగా తరలించబోయి అడ్డంగా దొరికిపోయాడు.
మొబైల్ ఫ్లిప్‌కవర్లలో ఏకంగా 2997 గ్రాముల బంగారం బిస్కెట్లను దాచిపెట్టి సెల్‌ఫోన్‌గా చూపించేందుకు యత్నించాడు. అయితే, అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు సోదాలు చేయడంతో సోలంకి వ్యవహారం బయటపడింది.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జితేంద్ర నుంచి స్వాధీనం చేసుకున్న పసిడి విలువ రూ.90లక్షలకు పైబడి వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.