Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎదురుగా అందమైన అమ్మాయిలు... అద్దాల గదిలో కూర్చోబెట్టి... చెప్పుకుంటే సిగ్గు చేటని....

Advertiesment
ఎదురుగా అందమైన అమ్మాయిలు... అద్దాల గదిలో కూర్చోబెట్టి... చెప్పుకుంటే సిగ్గు చేటని....
, శనివారం, 6 అక్టోబరు 2018 (18:52 IST)
పలానా హోటల్‌కి వచ్చి గిఫ్ట్ తీసుకెళ్లండి అని చెప్పి, భార్యభర్తలు ఇద్దరూ రావాలి అనే కండీషన్ పెడతారు. పొరబాటున మీరు వెళ్లేరా బుక్ అయినట్టే. ఎదురుగా అందమైన అమ్మయిలతోపాటుగా అద్దాల హాలులో కూర్చోపెట్టి కాఫీలు, జ్యూస్‌లు అందించి... ఇక చదవండి.

మీరు ఏదైనా బడా షాపింగ్ మాల్‌కి వెళితే... అక్కడ మీకు కొందరు వ్యక్తులు తారసపడతారు. ఓ కూపన్, పెన్ను మీ చేతిలో పెట్టి మీ వివరాలు, ఫోన్ నెంబరు సేకరిస్తారు. ఎందుకు అని మనం ప్రశ్నిస్తే లక్కీ డ్రా తీస్తాం అని సమాధానం ఇస్తారు. ఓ వారం తరువాత మీకు ఫోన్ చేసి.. సర్ మీరు లక్కీ డ్రాలో గెలుపొందారు. పలానా హోటల్‌కి వచ్చి గిఫ్ట్ తీసుకెళ్లండి అని చెప్పి, భార్యభర్తలు ఇద్దరూ రావాలి అనే కండీషన్ పెడతారు. పొరబాటున మీరు వెళ్లేరా బుక్ అయినట్టే. అద్దాల హాలులో కూర్చోపెట్టి కాఫీలు, జ్యూస్‌లు అందించి చిన్న పెట్టుబడితో విదేశాల్లో హాలీడే ప్యాకేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు... ఇలా పలు రకాలుగా మభ్యపెట్టి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు.
 
ఇప్పుడు డబ్బులు లేవు అనగానే మా దగ్గిర క్రెడిడ్ కార్డు ద్వారా చెల్లించే సౌకర్యం ఉందని మనల్ని ఇరుకునపెడతారు. సరిగ్గా ఇలానే బుక్ అయ్యారు ఇద్దరు. వివరాల్లోకి వెళితే సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బి.హెచ్.ఇ.ల్ ప్రాంతానికి చెందిన రోశయ్య అనే వ్యక్తికి 2017లో గ్లోబల్ తాజ్ ప్రైడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఫలానా షాపింగ్ మాల్‌లో మీరు వేసిన లక్కీ కూపన్‌కు బహుమతి వచ్చిందనీ, లక్డీకపూల్ లోని ఓ హోటల్‌కు దంపతులిద్దరూ రావాలని  పిలిపించుకున్నాడు.
 
అక్కడ ఓ అద్దాల గదిలో కూర్చోబెట్టి చిన్న పెట్టుబడితో విదేశీయానం, విదేశాల్లో బంగ్లా పొందవచ్చని నమ్మబలికాడు. వారి మాటల్ని నమ్మిన రోశయ్య దంపతులు రూ.3.50 లక్షలు చెల్లించారు. కొంతకాలానికి అదే ప్రాంతానికి చెందిన నీలకంఠరావుకు ఇదే మాదిరిగా ఫోన్ రావడంతో అతనూ వెళ్లి 2 లక్షలు చెల్లించాడు. ఆ తరువాత ఎన్నిసార్లు వారిని సంప్రదించినా స్పందన రాలేదు. 
 
చివరకు వీరిద్దరూ మోసపోయామని గ్రహించి సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్‌ను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి ఇద్దరే ఫిర్యాదు చేసినా ఇటువంటి బాధితులు నగరంలో వందల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. వాళ్లంతా చెప్పుకుంటే సిగ్గుచేటని గమ్మునే వుండిపోయినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదీ మనలాంటిదేనంటూ కొండముచ్చుకు స్టీరింగ్ ఇచ్చిన బస్సు డ్రైవర్