Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు వ్యభిచార ముఠాలకు లింకుందట..?

ఇప్పటికే బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువని పేరుంది. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రజా సేవను పక్కనబెట్టి.. నీచ పనులకు పాల్పడుతూ దొరికిపోయారు. తాజాగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు వ్యభిచ

Advertiesment
ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు వ్యభిచార ముఠాలకు లింకుందట..?
, శనివారం, 11 ఆగస్టు 2018 (16:09 IST)
ఇప్పటికే బీజేపీ నేతలకు నోటి దురుసు ఎక్కువని పేరుంది. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రజా సేవను పక్కనబెట్టి.. నీచ పనులకు పాల్పడుతూ దొరికిపోయారు. తాజాగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు వ్యభిచార ముఠాలతో సంబంధాలు ఏర్పరుచుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంఘటన అస్సోంలో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. అసోంలో ఓ వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సమీపంలోని మైహార్ పూర్ విహార్ లైన్ ప్రాంతంలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు వ్యభిచారిణిలను అదుపులోకి తీసుకున్నారు.  అయితే వారిని పోలీసులు విచారించడంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ వ్యభిచార ముఠాతో సాక్షాత్తూ ఇద్దరు అధికార పార్టీ బిజెపి ఎమ్మెల్యేలతో పాటు ఓ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు పట్టుబడ్డ వ్యభిచారిణులు పోలీసులకు వెల్లడించారు. వీరు అందించిన సమాచారంతో పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆ ఎమ్మెల్యేలకు ఈ కేసుకు సంబంధాలున్నట్లు తేలింది.

దీంతో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేలు అమీనుల్ హఖ్ లస్కర్, కిషోర్ నాథ్‌తో పాటు ఏఐయూడీఎఫ్‌కు చెందిన నిజాముద్దీన్ చౌదరిలపై కేసు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తును ముమ్మరం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళైన వారానికే భర్తకు బిస్కెట్ - ప్రియుడితో కాపురం.. ఎక్కడ?