Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్న చిత్రాలను పోస్టు చేసిన మోడల్- పదేళ్లు జైలు శిక్ష.. ఎక్కడ?

సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్స్, కామెంట్లు, షేర్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. ఇందుకోసం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ కొరియా కోర్టు న్యూడ్ చిత్రాలు విడుదల చేసిన మహిళకు పది నెలల జైల

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (11:46 IST)
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్స్, కామెంట్లు, షేర్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. ఇందుకోసం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ కొరియా కోర్టు న్యూడ్ చిత్రాలు విడుదల చేసిన మహిళకు పది నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాకి చెందిన ఓ మహిళా మోడల్, కొందరు పురుషులతో కలిసి న్యూడ్ ఫోటోలు దిగింది. వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది.
 
కానీ అక్కడే అడ్డంగా బుక్కైంది. నగ్న చిత్రాలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడం, షేర్ చేయడం దక్షిణ కొరియాలో చట్టరీత్యా నేరం. అక్కడి కార్యాలయాలు, రైళ్లు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు, వీధుల్లోనే కాకుండా కొన్ని స్కూళ్ల దగ్గర కూడా స్పై కెమెరాలను బిగించి రహస్యంగా నగ్నచిత్రాలు, వీడియోలు తీస్తున్నారు. ఈ ఫోటోలనూ, వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి, మార్కెట్ చేసుకుంటున్నారు. 
 
2010లో ఇలా రహస్యంగా ఆన్‌లైన్‌లో పెట్టిన న్యూడ్ ఫోటోల మీద 1100 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది వాటి సంఖ్య 6500కి పెరిగింది. దీంతో ఇలాంటి నేరాలను నియంత్రించేందుకు దక్షిణ కొరియా సర్కారు నగ్న చిత్రాలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 
 
ఆ కారణంగానే న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన మోడల్‌కు పది నెలల జైలు శిక్ష విధిస్తూ దక్షిణ కొరియా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సదరు మోడల్‌కు 40 గంటల పాటు లైంగిక నేరాలు, వాటికి విధించే శిక్షల గురించి కౌన్సిలింగ్ కూడా ఇవ్వనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం