Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి?.. మహిళకు ఎస్.ఐ వేధింపులు

పోకిరీల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ రక్షణ భటుడు కామాంధుడిగా మారిపోయాడు. ఓ మహిళను తన వికృత చేష్టలతో వేధించాడు. నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి? అంటూ వేళాపాళా లేకుండా పదేపదే ఫోన్లు చేసి వ

నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి?.. మహిళకు ఎస్.ఐ వేధింపులు
, సోమవారం, 13 ఆగస్టు 2018 (13:30 IST)
పోకిరీల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఓ రక్షణ భటుడు కామాంధుడిగా మారిపోయాడు. ఓ మహిళను తన వికృత చేష్టలతో వేధించాడు. నువ్వంటే నాకిష్టం.. నీ ఒపీనియన్‌ ఏమిటి? అంటూ వేళాపాళా లేకుండా పదేపదే ఫోన్లు చేసి విసుగుతెప్పించాడు. చివరకు అతని వేధింపులు భరించలేని ఆ మహిళ.. పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆ కీచక ఎస్.ఐ బండారం బయటపడింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఓ సివిల్‌ కేసు నిమిత్తం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అప్పుడు ఎస్‌ఐ వివాదంలో ఉన్న ఇరువురితో మాట్లాడి పంపించేశారు. ఆ తర్వాత విచారణ పేరుతో ఆమె ఫోన్‌ నెంబర్‌ తీసుకుని తరచూ అర్థరాత్రిళ్లు అభ్యంతరకరంగా మాట్లాడటం మొదలు పెట్టారు.
 
నిజానికి ఆ మహిళ బంధువులు గతంలో కల్తీసారా వ్యాపారం చేస్తుండేవారు. తరచూ తనిఖీలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబం సారా విక్రయం మానుకుని కూలి పనులకు వెళ్తోంది. అయినా ఎస్‌ఐ అమె ఇంటికి చాలాసార్లు తనిఖీలకు వెళ్లేవారు. అసభ్యకరంగా మాట్లాడేవారు. 
 
తాజాగా ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య ఈ మహిళకు రాత్రిళ్లు ఫోన్‌చేసి నువ్వంటే నాకిష్టమని వేధించారు. ఆమె అంగీకరించకపోవడంతో సారా విక్రయిస్తున్నావా? అని బెదిరింపులకు దిగారు. ఎస్‌ఐ ఫోన్‌లో మాట్లాడినవన్నీ ఆమె రికార్డింగ్‌ చేసి ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ వెంటనే స్పందించి ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహా సంప్రోక్షణం.. బోసిపోయిన వెంకన్న ఆలయం.. 18వేల మందే..?