Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన లుఫ్తాన్సా

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (07:45 IST)
ఉక్రెయిన్ - రష్యాల దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఆవహించివున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సేనలు ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం ఉంది. దీంతో జర్మనీకి చెందిన ప్రముఖ పౌరవిమానయాన సంస్థ లుఫ్తాన్సా ఉక్రెయిన్ దేశానికి నడుపుతూ వచ్చిన విమాన సర్వీసులను నిలిపివేసింది. 
 
ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణమైనా దాడికి దిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో లుఫ్తాన్సా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పోర్టు సిటీ ఒడిసా నుంచి నేటి నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల్లో తమకు వ్యాపారం కంటే తమ ఉద్యోగులు, ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, అందులోభాగంగానే విమాన సేవలను నిలిపివేసినట్టు పేర్కొన్నారు. అయితే, ఈ నెలాఖరు వరకు కివ్, పోర్టు సిటి ఒడిసాలకు మినహా మిగిలిన నగరాలకు విమాన సర్వీసులు నడుపుతామని వెల్లడించింది. 
 
కాగా, రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తల నేపథ్యంలో డచ్ ఎయిర్‌లైన్స్ కేఎల్ఎం కూడా గత వారమే కీవ్ నగరానికి విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెల్సిందే. 
 
ఉక్రెయిన్‌ను తక్షణం ఖాళీ చేయండి : భారత్ ఆదేశం 
 
ఉక్రెయిన్ దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించేందుకు రష్యా సేనలు సర్వసిద్ధంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యాలను అత్యాధునిక అస్త్రాలను ఎక్కుపెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ కారణంగా ఉక్రెయిన్ - రష్యాల మధ్య ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోలేదు. 
 
దీంతో ఉక్రెయిన్‌లో భారత పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాల్సిందిగా కేంద్రం హెచ్చరిక చేసింది. అత్యవసరమైతే మినహా ఉక్రెయిన్‌లో ఉండొద్దని కోరింది. విద్యార్థులతో సహా భారతీయులంతా అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టెర్డ్ విమానాల్లో ఉక్రెయిన్ నుంచి బయటపడాలని పేర్కొంది. 
 
ముఖ్యంగా, విద్యార్థులు స్టూడెంట్ ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుండాలని, తాజా సమాచారం కోసం భారత హైకమిషన్‌ సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికపుడు పరిశీలిస్తుండాలని సూచన చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని, ఏ క్షణమైనా రష్యా విరుచుకుపడే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. అందువల్ల ఆ దేశంలోని భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. తక్షణం ఆ దేశాన్ని వీడాలని సూచన చేసింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments