Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటకలో హిజాబ్ వివాదం - 58 మంది విద్యార్థుల సస్పెండ్!

Advertiesment
కర్నాటకలో హిజాబ్ వివాదం - 58 మంది విద్యార్థుల సస్పెండ్!
, ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (09:22 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం కొనసాగుతోంది. శివమొగ్గ జిల్లా శిరాల్కొప్పలో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన 58 మంది విద్యార్థినులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడం కలకలం రేగింది. ఇది పెద్ద వివాదానికి దారితీసేలా కనిపించడంతో ఆ రాష్ట్ర మంత్రి నారాయణ గౌడ వివరణ ఇచ్చారు. విద్యార్థినులను సస్పండ్ చేయలేదని కేవలం హెచ్చరించారని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ కూడా తెలిపారు. 
 
అదేసమయంలో హిజాబ్ దుస్తుల్లో కాలేజీలకు వస్తే రూ.200 అపరాధం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ హాసన్‌లో నోటీసులు అంటించారు. మరోవైపు, అన్ని మతాల పెద్దలు శనివారం అత్యవసరంగా సమావేశమై ఈ వివాదంపై చర్చించారు. ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మతసామరస్యాన్ని కొనసాగించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో సనాతన ఆలోచనల నుంచి మైనారిటీలు బయటకు రావాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్ హితవు పలికింది. హిజాబ్ కంటే విద్యే ముఖ్యమని మంచ్ జాతీయ కన్వీనర్ షాహిద్ సయీద్ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైభవంగా 108 దివ్యదేశ మూర్తులకు శాంతి కల్యాణం