Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలను, విద్యార్థుల అభ్యాసాన్ని పెంచేందుకు స్కూల్‌ ఎడ్‌టెక్‌ అగ్రగామి లీడ్‌ కృషి

బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రవేశాలను, విద్యార్థుల అభ్యాసాన్ని పెంచేందుకు స్కూల్‌ ఎడ్‌టెక్‌ అగ్రగామి లీడ్‌ కృషి
, ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:45 IST)
అడ్మిషన్‌ సీజన్‌ దగ్గరలోనే ఉంది. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సరైన పాఠశాలను ఎంపిక చేసుకోవడం మరియు వారి విద్యా భవిష్యత్‌కు భరోసా అందించడం పరంగా పూర్తి ఆందోళనలో ఉన్నారు. మహమ్మారి కాలంలో ఈ నిర్ణయం తీసుకోవడం కష్టతరంగా ఉంది. దీనికి తోడు క్లాస్‌రూమ్‌ స్కూలింగ్‌లో అవరోధాలు మరియు ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్‌ కేసులు కూడా ఈ అనిశ్చితికి కారణమవుతున్నాయి.

 
అభ్యాస అంతరాలను పూరించడం...
మహమ్మారి కారణంగా విద్యా రంగంలో కనిపించిన అతిపెద్ద పరిణామాలలో ఒకటిగా అభ్యాస నష్టాలు నిలుస్తాయి. దీనికి సుదీర్ఘకాలం పాటు పాఠశాలలు మూసి ఉంచడం కూడా  ఓ కారణం. గత కొద్ది నెలలుగా కొన్ని రాష్ట్రాలలో పాఠశాలలను తిరిగి  తెరుస్తున్నారు కానీ కొంతమంది విద్యార్థులు గత 20 నెలలుగా అసలు పాఠశాలలకు వెళ్లలేదు. ఇది బడ్జెట్‌ స్కూల్స్‌పై తీవ్రంగా ప్రతికూలతను చూపింది. దీనితో పాటుగా అభ్యాస అంతరాలు కూడా గణనీయంగా పెరిగాయి.  మరీ ముఖ్యంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లల్లో ఈ అంతరాలు బాగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అధిక శాతం పాఠశాలలు ఇప్పటికీ అభ్యాస అంతరాలను పూరించేందుకు మరియు తమ విద్యార్థులను వేగంగా నిష్ణాతులుగా మార్చేందుకు కృషి చేస్తున్నాయి.

 
స్కూల్‌ ఎడ్‌టెక్‌ అగ్రగామి లీడ్‌. ఇది దాదాపుగా 400కు పైగా నగరాలలో మూడు వేలకు పైగా బడ్జెట్‌ పాఠశాలలకు సేవలనందిస్తుంది. అంతేకాదు, భారదేశంలో పాఠశాల విద్యను సమూలంగా మార్చడంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. మరీముఖ్యంగా, 12 లక్షల మందికి పైగా విద్యార్థులకు అభ్యాస అంతరాలను పూరిస్తుంది. ప్రస్తుతం ఇది  ఆంధ్రప్రదేశ్‌లో  177 పాఠశాలల్లోని 88,700 మందికి పైగా విద్యార్థులు, తెలంగాణాలో  209 పాఠశాలల్లోని 108,200 మందికి పైగా విద్యార్థులకు తమ ఇంటిగ్రేటెడ్‌ అభ్యాస వ్యవస్థ ద్వారా సహాయపడుతుంది.

 
‘ఎట్‌ స్కూల్‌’ అభ్యాసం అనేది  విద్యకు అత్యంత కీలకం. దేశంలో 270 మిలియన్‌ విద్యార్ధులకు అభ్యాస ఫలితాలపై ప్రభావం చూపడంలో అత్యంత కీలకంగా ఇది ఉండనుంది. ఎందుకంటే, ఈ విద్యార్థులలో అధిక శాతం మంది అతి తక్కువ ఫీజులు లేదా బడ్జెట్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌పై ఆధారపడుతున్నారు. ఈ తరహా పాఠశాలల ప్రయత్నాలను గుర్తించడంతో పాటుగా వేడుక చేయడంలో భాగంగా ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ఇప్పుడు ఈడబ్ల్యు ఇండియా బడ్జెట్‌ ప్రైవేట్‌ స్కూల్‌ ర్యాంకింగ్స్‌ను అందిస్తుంది. ఈ సంవత్సరం, తెలంగాణా నుంచి ఈ ర్యాంకింగ్స్‌లో  ప్రవేశం పొందిన 70  పాఠశాలల్లో 39 పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్‌నుంచి ఈ ర్యాంకింగ్స్‌లో  ప్రవేశం పొందిన 67  పాఠశాలల్లో 44 పాఠశాలలు లీడ్‌ శక్తివంతమైన పాఠశాలలు. ఈ అవార్డు ఆ పాఠశాలలకు ప్రపంచంలో అత్యంత సరసమైన ప్రైవేట్‌ పాఠశాల విద్యను అల్పాదాయ కుటుంబాలలోని విద్యార్థులకు అందిస్తుంది.

 
అత్యద్భుతమైన విద్యకు ఐదు గుర్తులు
సంప్రదాయ మరియు స్కూల్‌ ఎడ్‌టెక్‌ విద్యలో తమ సహచరులకు భిన్నంగా లీడ్‌ పవర్డ్‌ స్కూల్స్‌ను నిలిపే అంశమేమిటంటే, దీనిలో వినూత్నంగా డిజైన్‌ చేసిన 5 అత్యద్భుతమైన విద్య గుర్తులు. ఇది అత్యంత అందుబాటులో ప్రపంచ శ్రేణి విద్యను ఇంటి వద్దనే అందిస్తుంది.

 
ఈ ఐదు గుర్తులు...
1. సింగపూర్‌, కెనడా, యుఎస్‌ఏ పాఠశాలలు సహా ప్రపంచంలో అత్యుత్తమ విద్యతో సమానంగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కరిక్యులమ్‌.
 
2. స్మార్ట్‌ టీవీలు, టాబ్లెట్‌ మరియు యాక్టివిటీ కిట్స్‌తో స్మార్ట్‌ క్లాస్‌రూమ్స్‌.
 
3. లీడ్‌ నిపుణుల చేత శిక్షణ పొందిన సూపర్‌ టీచర్లు మరియు రెడీమెడ్‌ వనరులతో కూడిన టాబ్లెట్‌ ద్వారా మద్దతు పొందుతారు.
 
4. లీడ్‌ స్టూడెంట్‌ యాప్‌తో ఇంటి వద్దనే ప్రపంచ శ్రేణి అభ్యాసం. చిన్నారుల అభివృద్ధిని తెలుసుకోవడం కోసం పూర్తిగా అంకితం చేసిన పేరెంట్‌ సెక్షన్‌.
 
5. సెలబ్రిటీ మాస్టర్‌ క్లాస్‌లు, భారతదేశపు అతిపెద్ద  విద్యార్థి చాంఫియన్‌ షిప్‌, అలాగే విద్యార్థి ఆధారిత సదస్సులుతో విద్యార్ధులకు అపరిమిత ఎక్స్‌పోజర్‌తో అవకాశాలతో కూడిన ప్రపంచాన్ని తెరుస్తుంది.
 
అత్యద్భుతమైన విద్యలో ఈ ఐదు గుర్తులు విద్యార్థులు పూర్తి స్ధాయి అభ్యాస అనుభవాలను అందించడంతో పాటుగా పూర్తి ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. అందువల్ల వారు భవిష్యత్‌కు సిద్ధం కాగలరు. మహమ్మారి నేపథ్యంలో, లీడ్‌ మాస్టర్‌ క్లాస్‌ సిరీస్‌ ఇప్పుడు విద్యార్థులకు ఎంతోమంది సెలబ్రిటీలు అంటే సుప్రసిద్ధ రచయిత చేతన్‌ భగత్‌, టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా మరియు లెజండరీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ వంటి వారితో సంభాషించడం ద్వారా నేర్చుకునే అవకాశం అందిస్తుంది.
 
లాక్‌డౌన్‌ ఆరంభమైన కొద్ది రోజుల్లోనే ఇంటి వద్ద అభ్యాసం  ప్రారంభించిన మొదటి సంస్థగా లీడ్‌  నిలిచింది.  అప్పటి నుంచి, అన్ని లీడ్‌ పవర్డ్‌ పాఠశాలలు హైబ్రిడ్‌ మోడల్‌ను స్వీకరించాయి. దీనిలో భాగంగా ఆన్‌లైన్‌–ఆఫ్‌లైన్‌ అభ్యాసం అందించడంతో పాటుగా గణనీయంగా పాఠశాలలు, టీచర్ల పాత్రను బలోపేతం చేస్తుంది. తద్వారా విద్యార్థుల విద్యా ప్రదర్శనను మెరుగుపరుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుపేద విద్యార్థిని ఎం.శ్రీలేఖకు ల్యాప్‌టాప్ అందించిన గవర్నర్ తమిళసై సౌందర రాజన్