ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ)లో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. పలువురు సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో వేదించారు. ఈ వ్యపహారం వెలుగు చూడటంతో తక్షణం స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ తొలుత 11 మంది సీనియర్ విదార్థులను సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు కొందరు అధ్యాపకులతో కలిసి అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ర్యాగింగ్ అంశంపై లోతుగా విచారణ జరిపింది. ఇందులో కొందరు సీనియర్ విద్యార్థులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తేలింది.
ఈ ర్యాగింగ్‌కు మొత్తం 18 మంది పాల్పడినట్టు తేలడంతో వారిని తక్షణం సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీచేశారు. ఈ కాలేజీలో చదివే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేకాకుండా మరో ముగ్గురు సీనియర్ విద్యార్థులు కూడా ర్యాంగింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై విచారణ జరుపుతున్నారు.