Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బిగ్ బాస్' ఫేమ్ సరయు అరెస్టు

Advertiesment
Sarayu
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ సరయును తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈమెపై సిరిసిల్ల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల సిరిసిల్లలో కొత్తగా నిర్మించిన ఓ హోటల్ ప్రారంభోత్సవానికి సరయుతో పాటు ఆమె స్నేహితులు వచ్చారు. ఇందుకోసం ఆమె ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు. ఇది జనవరి 25వ తేదీన ప్రసారమైంది. 
 
ఈ ప్రకటనలో సరయు, ఆమె స్నేహితులు మద్యం సేవించి, గణపతి బప్పా మోరియా కోట్స్‌తో కూడిన బ్యాండ్‌లను ధరించారు. ఈ ప్రకటన హిందూ మతం, మహిళల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని సిరిసిల్ల వీహెచ్‌పీ అధ్యక్షుడు అశోక్‌ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా పోలీసుల ఛాతి కొలతలు తీసిన పురుష టైలర్.. ఎందుకు.. ఎక్కడ?