Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత వ్యాక్సిన్ల కంటే రష్యా వ్యాక్సిన్ ధర ఎక్కువ.. ఎంతంటే?

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (15:36 IST)
కరోనా వైరస్ సోకకుండా అడ్డుకునేందుకు వీలుగా కొన్ని ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వీటి ధరల్లో తేడా వుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే దేశానికి రానున్న రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఒక డోసు ధరను నిర్ణయించారు. ఈ  ప్రకారంగా ఒక డోసు ధర రూ.995.40గా నిర్ణ‌యించిన‌ట్లు శుక్ర‌వారం వెల్ల‌డించింది. 
 
ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకున్న టీకాల‌కు ఈ ధ‌ర ఉంటుంద‌ని, ఇండియాలో త‌యారయ్యే వాటికి త‌క్కువ ధ‌ర ఉండే అవ‌కాశం ఉంద‌ని ఈ వ్యాక్సిన్లను భారత్‌లోకి దిగుమతి చేస్తున్న డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ తెలిపింది. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ల్యాండైన ఈ టీకా ఎమ్మార్పీని రూ.948గా నిర్ణ‌యించ‌గా.. దానికి 5 శాతం జీఎస్టీ క‌లిపితే ధ‌ర రూ.995.40 అవుతుంది. 
 
ఈ టీకా తొలి డోసును ఇప్ప‌టికే హైద‌రాబాద్ వ్య‌క్తికి వేసిన‌ట్లు రెడ్డీస్ ల్యాబ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ నెల 1వ తేదీనే ల‌క్ష‌న్న‌ర స్పుత్నిక్ వి టీకాలు హైద‌రాబాద్‌లో దిగిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే కొద్ది నెల‌ల్లో మ‌రిన్ని డోసులు దిగుమ‌తి అవుతాయ‌ని, త్వ‌ర‌లోనే భారత్‌లోనూ ఈ వ్యాక్సిన్ తయారీ ప్రారంభిస్తామ‌ని రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments