ఇంట్లో పిచ్చెక్కిపోతోంది.. శృంగారం కోసం వెళ్లేందుకు ఈ-పాస్ ఇవ్వండి..

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (15:20 IST)
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దీంతో ఈ వైరస్ గొలుసు కట్టును తెంచేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలుచేస్తోంది. దీంతో ప్రజలంతా వారివారి ఇళ్లలోనే ఉంటున్నారు. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ-పాస్ తీసుకోవాలన్న నిబంధన విధించారు. 
 
ఈ నేపథ్యంలో కేర‌ళ‌లోని ఓ వ్య‌క్తి ఈ-పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. దాంట్లో ఓ చిత్ర‌మైన అభ్య‌ర్థ‌న చేశాడు. ఇంట్లో ఉండలేకపోతున్నాను. పిచ్చెక్కినట్టుగా అవుతుంది. శృంగార కోసం బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్నాను.. దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్య‌క్తి పోలీసుల్ని కోరాడు. 
 
క‌న్నూరులోని ఇరినేవ్ గ్రామ స్థానికుడు ఈ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. అప్లికేష‌న్ పెట్టిన ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. వాలాప‌ట్ట‌ణం పోలీసులు అత‌న్ని వెతికి ప‌ట్టుకున్నారు. అయితే అక్ష‌ర దోషం వ‌ల్ల త‌న అప్లికేష‌న్‌లో పొర‌పాటు జ‌రిగిన‌ట్లు స‌ద‌రు వ్య‌క్తి పోలీసుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాడు. 
 
ఇంగ్లీషులో సిక్స్ ఓ క్లాక్ అని రాయాల‌ని అనుకున్నాన‌ని, కానీ త‌న ద‌ర‌ఖాస్తులో పొర‌పాటున‌ సెక్స్ అని పొరపాటున పడిందని, దీన్ని తాను గమనించలేదని తెలిపాడు. ఆ వ్య‌క్తి క్ష‌మాప‌ణ‌ల‌ను స్వీక‌రించిన పోలీసులు.. అన‌వ‌స‌ర కార‌ణాల‌తో ఈ-పాస్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ద్దు అంటూ అత‌న్ని రిలీజ్ చేశారు. 
 
బీహార్‌లోనూ ఓ వ్య‌క్తి కూడా చిత్ర‌మైన కార‌ణం చూపుతూ.. ఈ-పాస్ ఇవ్వాల‌ని కోరాడు. మొటిమ‌ల చికిత్స కోసం వెళ్లేందుకు త‌న‌కు పాస్ ఇవ్వాల‌ని అత‌ను కోరాడు. దీన్ని బీహార్ పోలీసులు సీరియ‌స్‌గా తీసుకుని, ఆ అకతాయికి సరైన బుద్ధి చెప్పిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం