Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరులో కంటికి కనిపించని వ్యాక్సిన్లు.. పత్తాలేని అధికారులు

Advertiesment
గుంటూరులో కంటికి కనిపించని వ్యాక్సిన్లు.. పత్తాలేని అధికారులు
, సోమవారం, 10 మే 2021 (10:59 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్లు కంటికి కనిపిచలేదు. వ్యాక్సిన్లు ఇదిగో వస్తున్నాయి.. అవిగో వస్తున్నాయ అంటూ భీకరాలు పలికిన అధికారులు చివరకు పత్తాలేకుండా పోయారు. దీంతో జిల్లాలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
సోమవారం నుంచి ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ వేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో ఉదయాన్నే వ్యాక్సిన్ కేంద్రాలకు ప్రజలు తరలివచ్చారు. కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాని పరిస్థితి ఉంది. 
 
ఉదయం నుంచి ప్రజలు పడిగాపులు కాస్తున్నా... అధికారులు పత్తాలేకుండాపోయారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత లోక్డౌన్ అని చెప్పారని... ఇంక ఎప్పుడు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సినేషన్ వేయడం కుదరదని చెబితే వచ్చే వాళ్ళం కాదు అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మొదటి డోస్‌ రిజిస్ట్రేషన్ల రద్దు  
 
మరోవైపు, కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ కోసం ఈ నెలాఖరు వరకు ఎవరూ వ్యాక్సిన్‌ కేంద్రాలకు రావొద్దని కలెక్టర్‌ తెలిపారు. జూన్‌ మొదటి వారం నుంచి ఫస్టు డోస్‌ అందుబాటులో ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోలేరని చెప్పారు. అలానే ఫస్టు డోస్‌ కోసం వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఎలాంటి స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కూడా చేయడానికి వీలుండదన్నారు. 
 
ఇప్పటికే ఫస్టు డోస్‌ కోసం ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు తెలిపారు. తొలి డోస్‌ తీసుకుని రెండో డోస్‌ కోసం ఎవరైతే పెండింగ్‌లో ఉన్నారో ఆ వివరాలను జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం పంపించిందన్నారు. 
 
వారికి ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఏ తేదీన ఎక్కడ వ్యాక్సిన్‌ వేయించుకోవాలో తెలియజేయడం జరుగుతుందన్నారు. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే వ్యాక్సినేషన్‌ కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. లబ్ధిదారులను గదుల్లో భౌతిక దూరం పాటించేలా కూర్చొబెట్టి వారి వద్దకే   సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్‌ వేస్తారని చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శవాలపై పేలాలు ఏరుకునే జగన్ సర్కారు : దేవినేని ఉమ ధ్వజం