కరోనావైరస్ భారతదేశంలో కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా వేసుకుని రక్షణ పొందాలని ప్రభుత్వాలు చెపుతున్నాయి. తాజాగా 'శివగామి' రమ్యకృష్ణ కోవిడ్ రెండో డోసు వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ పేజిలో షేర్ చేసారు.
అంతకుముందు మొదటి డోసు వేసుకున్న సమయంలో కేవలం మాస్కు మాత్రమే ధరించారు రమ్యకృష్ణ. కరోనా సెకండ్ వేవ్ ఉధృతం నేపధ్యంలో ఈసారి మాస్కుతో పాటు ముఖానికి అద్దాన్ని ధరించి వచ్చి టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఫోటోను షేర్ చేసారు.