Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌లో కెమికల్ ప్లాంట్‌పై రష్యా దాడి

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (13:03 IST)
ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య తారా స్థాయికి చేరింది. ఈ యుద్ధం ప్రారంభించి నెల రోజులు కావొస్తున్నప్పటికీ అతి చిన్నదేశమైన ఉక్రెయిన్ తమ దారికి రాకపోవడంతో రష్యా భీకర యుద్ధ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులోభాగంగా, ఉక్రెయిన్ దేశంలోని ఓ రసాయన ప్లాంట్‌పై బాంబులతో దాడి చేశారు. 
 
ఉక్రెయిన్‌లోని సుమీ నగర సమీపంలో ఉన్న సుమీఖింఫోరమ్ కెమికల్ ప్లాంట్‌ నుంచి భారీగా అమ్మోనియా వాయువు లీకైంది. ఆ ప్లాంటుకు 2.5 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సమీప గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా ప్రాంతాల ప్రజలు వెంటనే అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళాలని స్థానిక గవర్నర్ పిలుపునిచ్చారు. 
 
ఉక్రెయిన్‌లో బాంబుల మోత
ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా ఉద్దేశ్యపూర్వకంగా మారణహోమం సృష్టిస్తున్నాయి. తాజాగా మేరియుపోల్‌లో 400 మంది ఆశ్రయం పొందుతున్న ఓ ఆర్ట్ స్కూల్ భవనంపై రష్యా సేనలు బాంబులతో విరచుకుపడ్డాయి. దీంతో ఈ భవనం నేలమట్టమైంది. ఇందులో తలదాచుకున్న అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, గత నెల 23వ తేదీన ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా... క్రమక్రమంగా పట్టుసాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పలు కీలక నగరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. తాజాగా అత్యంత కీలక నగరంగా భావించే మేరియుపోల్‌ నగరంపై కూడా పూర్తిపట్టు సాధించింది. అయితే, రాజధాని కీవ్ నగరం సమీపంలో ఉన్న రష్యా బలగాలు మాత్రం పట్టు సాధించలేక పోతున్నాయి. కానీ, మేరియుపోల్‌ను మాత్రం సులభంగానే ఆధీనంలోకి తీసుకుంది. 
 
మరోవైపు, రష్యా మూర్ఖత్వంలో యుద్ధం చేస్తుందని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్ అన్నారు. అయితే, తాము ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, స్వాంత్ర్యాలకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీనివల్ల భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివైనా మూల్యం చెల్లించేందుకు సిద్ధఁగా ఉన్నామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments