Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డ్ ర‌స్తీకి రామ్ చరణ్ సాయం

Advertiesment
ఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డ్ ర‌స్తీకి రామ్ చరణ్ సాయం
, శనివారం, 19 మార్చి 2022 (16:20 IST)
Rusty, Ram Charan
రష్యా-ఉక్రెయిన్‌ మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధంలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తెర మీదకు వచ్చింది. నిజానికి ఉక్రెయిన్‌కి, చరణ్‌కి సంబంధం లేదు. కానీ రష్యా సైనికుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్న ఒక ఉక్రెయిన్‌ పౌరుడికి, రామ్‌చరణ్‌కు సంబంధం ఉంది. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన ట్రిపుల్‌ ఆర్‌ మూవీ షూటింగ్‌.. కొంతకాలం ఉక్రెయిన్‌లో కూడా జరిగింది. ఆ షూటింగ్‌ జరిగే సమయంలో రస్తీ అనే వ్యక్తి చరణ్ కు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశారు. దీంతో చరణ్‌తో రస్తీకి సాన్నిహిత్యం ఏర్పడింది. 
 
అయితే.. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్ష్యుడి పిలుపు మేరకు 80 ఏళ్ళ రస్తీ తండ్రి, రస్తీ కూడా మిలిటరీలో చేరి తమ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం కారణంగా రస్తీ ఆ దేశ పౌరుల లానే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం అనగానే తనకు ఉక్రెయిన్లో రక్షణ అందించిన రస్తీనే చరణ్ కు గుర్తు వచ్చారు. వెంటనే పలకరించగా రస్తీ పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. వెంటనే రస్తీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. చెర్రీ తనకు చేసిన సాయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు రస్తీ. కొంత కాలమే ఆయన కోసం కలిసి పనిచేసినా.. కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం చరణ్‌ గొప్ప మనసుకి నిదర్శనమని రస్తీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

RRR Press Meet: చిక్కబల్లాపూర్‌‌లో ప్రీ-రిలీజ్‌