Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారు ప్రమాదంలో టాలీవుడ్ నటి మృతి

Advertiesment
Tollywood actress Gayatri died
, శనివారం, 19 మార్చి 2022 (15:48 IST)
హోలీ వేడుకలను సంతోషంగా జరుపుకున్న నటి కొన్ని నిమిషాల్లోనే మరణించిందంటే నమ్మలేకపోతున్నారు ఆమె తోటి స్నేహితురాళ్లు, టాలీవుడ్ వర్ధమాన నటీనటులు. ప్రముఖ యూట్యూబర్, వర్థమాన నటి గాయత్రి శుక్రవారం రాత్రి గచ్చిబౌలి రోడ్డులో జరగిన కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృత్యువాత పడింది.

 
శుక్రవారం నాడు రోహిత్ అనే వ్యక్తి గాయత్రిని పకప్ చేసుకుని ప్రిజమ్ పబ్‌కి తీసుకుని వెళ్లాడు. అక్కడ హోలీ వేడుకలు చేసుకుని రాత్రి 10 గంటలకు తిరిగు ప్రయాణమయ్యారు. కారును గాయత్రి డ్రైవ్ చేస్తూ వచ్చింది.

 
ఐతే అతివేగంతో కారు నడపడటంతో కారు ఫుట్ పాత్ పైన బోల్తా కొట్టింది. దీనితో గాయత్రి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు వున్న రోహిత్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగులోకి కాశ్మీర్ ఫైల్స్..