Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్ 8న రిలీజ్ అవుతున్న నేను లేని నా ప్రేమకథ

Advertiesment
అక్టోబర్ 8న రిలీజ్ అవుతున్న నేను లేని నా ప్రేమకథ
, బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:57 IST)
Naveen Chandra, Gayatri Suresh
త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ కందుకూరి, ఎ.భాస్కరరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. ఈ చిత్రం UFO Moviez INDIA LIMITED ద్వారా అక్టోబర్ 8న విడుదలకు సిద్ధమైంది.
 
ఈ సంగీత ప్రేమకథా చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించగా నవీన్ చంద్ర, గాయత్రి సురేష్ న‌టిస్తున్నారు. క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ తారాగణంగా కీలక పాత్రలో సీనియర్ నటుడు రాజా రవీంద్రలతో ఈ చిత్రం నిర్మించబడింది.
 
ఇటీవల జెమినీ రికార్డ్స్(మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర సంగీతం శ్రోతలను, సినిమా అభిమానులను ఎంతగానో అలరించింది.
 
వినూత్న కథాంశంలో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం నిర్మించబడిందని, అలాగే  మా ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న UFO Moviez వారికి ప్రత్యేక కృతజ్ఞతలను చిత్ర నిర్మాత కళ్యాణ్ కందుకూరి మరియు చిత్ర దర్శకుడు సురేష్ ఉత్తరాది తెలియజేశారు.
 
ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని, అక్టోబర్ 8న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రాన్ని UFO Moviez INDIA LIMITED ద్వారా థియేటర్స్‌లో విడుదల చేయడం జరుగుతుంది.
 
ఈ చిత్రానికి చాయాగ్రహణం SKa భూపతి, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, మాటలు సాబిర్ షా, లిరిక్స్ రాంబాబు గోసాల, సంగీతం జువెన్ సింగ్ అన్ని విభాగాలు ప్రధాన భూమికను పోషించాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత - హైదరాబాద్ నా ఇల్లు అంటూ..