ఇండియా ప్రజాస్వామ్య దేశం. ఆ పేరుతో యాభే ఏళ్ళుగా దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ పేరుతో ఎన్నో అరాచకాలు చేస్తున్నారు. దానిని ఎవరూ సరిదిద్దలేరా? అంటూ శుభలేఖ సుధాకర్ ప్రశ్నిస్తున్నారు. కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయికుమార్, కృష్ణ ప్రియ, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా `అర్ధ శతాబ్దం`. రవీంద్ పుల్లె దర్శరకుడు. ఈ సినిమాను ఈనెల 11న ఆహా ఓటీటీలో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలోని పాత్ర గురించి జూమ్ ఇంటర్వ్యూలో శుభలేఖ సుధాకర్ తెలిజేస్తున్నారు. కుర్రాళ్ళైన టీమ్ ఈ కథను బాగా రాశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు. మరి యాభై ఏళ్ళుగా ఎందుకు గొడవలు జరుగుతున్నాయి. డెమొక్రసీ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ ఇదే ప్రశ్న. ఇంకా జవాబులేనిదిగానే మిగిలి వుంది. ఈ కథలో నా పాత్ర తీర్చిన విధానం అద్భుతంగా వుంది. అన్నారు.
నటి ఆమని మాట్లాడుతూ, ఏదో మామూలు సినిమా అని నటించాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఎంత అద్భుతంగా ఇప్పటి కుర్రాళ్ళు ఈ సినిమాను రాసుకున్నారో అనిపించింది. ఇప్పటి తరమైనా రాజ్యాంగంపై మంచి అవగాహన వుంది. దేశానికి వెన్నెముకలైన యూత్ తీసిన ఈ సినిమా అందరినీ ఆలోచింపజేస్తుంది అన్నారు.