Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాషాయాన్ని కాపాడలేని స్టార్ క్యాంపైనర్లు... దీదీకే బెంగాల్ పట్టం

Advertiesment
కాషాయాన్ని కాపాడలేని స్టార్ క్యాంపైనర్లు... దీదీకే బెంగాల్ పట్టం
, ఆదివారం, 2 మే 2021 (15:28 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలనాథులకు ఆదివారం వెలువడిన ఫలితాలు తేరుకోలేని షాకిచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థుల కోసం మిథున్ చక్రవర్తి లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలను రంగంలోకి దించినా ఓటర్లను ఆకర్షించలేకపోయాయి. ఫలితంగా బెంగాల్ దంగల్‌లో బీజేపీ చతికిలపడగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోమారు విజయభేరీమోగించి, మూడోసారి అధికారాన్న హస్తగతం చేసుకోనుంది. 
 
ఇందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎంతగానే పనిచేశాయని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఆయన ఆ మధ్య చేసిన ట్వీట్‌ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. "ఇండియాలో ప్రజాస్వామ్యానికి ఈ సూచికలని, బెంగాల్ ప్రజలు ‘రైట్ కార్డు’ను చూపాలనే నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. బెంగాల్‌కి తన కుమార్తె (మమతా బెనర్జీ) మాత్రమే అవసరమని మే 2న తన చివరి ట్వీట్‌ను చూడడానికి సిద్ధంగా ఉండాలని" ఆయన గత ఫిబ్రవరి 27 న ట్వీట్ చేశారు. 
 
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూసేందుకు ప్రశాంత్ కిషోర్ తన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ టీమ్‌తో ఓ వ్యూహాన్ని రూపొందించారు. ఆ వ్యూహం ఫలించి బెంగాల్‌లో మళ్ళీ దీదీ నేతృత్వంలోని టీఎంసీ.. అత్యధిక సీట్లలో లీడింగ్‌లో ఉంది. ఇక మూడో సారి పవర్ దిశగా పరుగులు తీస్తోంది. 
 
ఈ ఎన్నికల్లో తమ పార్టీదే విజయమని, 200 సీట్లకు పైగా గెలుస్తామని, తమ రోడ్ షోలు, ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోడీ, అమిత్ షాలు ధీమా వ్యక్తం చేశారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తాము 18 సీట్లను గెలుచుకున్నామని, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పంథా సాధిస్తామని బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
కానీ బెంగాల్ ఓటర్ల తీరు మరోలా ఉంది. మమత పార్టీకే వారు జై కొట్టారు. బీజేపీ అనేకమంది సినీ, టీవీ స్టార్స్‌ని తమ స్టార్ కాంపెయినర్లుగా రంగంలోకి దింపింది. సీనియర్ బెంగాలీ, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సేవలను కూడా ఉపయోగించుకుంది. తన బెంగాలీ సినిమాల్లోని డైలాగులను మిథున్ వల్లించినా ఓటర్లు కొట్టి పారేశారు. అయితే నందిగ్రామ్‌లో సువెందు అధికారి తరఫున మిథున్ చేసిన ప్రచారం మాత్రం ఫలితం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మమతా బెనర్జీ కాస్త వెనుకబడివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగాల్‌పై బీజేపీ దండయాత్ర ... రాణి 'రుద్రమదేవి'లా మమతా బెనర్జీ