Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనాల మధ్య ఘర్షణ - తోకముడిచిన డ్రాగన్ సైన్యం

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:31 IST)
డ్రాగన్ దేశం తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. తూర్పు ల‌డఖ్‌లో మ‌ళ్లీ సైనికుల‌ను త‌ర‌లిస్తూ చైనా మ‌రోసారి దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది. దీంతో చైనా సైనికుల‌ను ఎదుర్కొనేందుకు భార‌త సైన్యం కూడా ధీటుగా స్పందించింది. దీంతో చైనా సైనికులు తోకముడిచి అక్కడ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. 
 
మ‌రోవైపు, అరుణాచ‌ల్ సెక్టార్‌లోనూ చైనా రెచ్చ‌గొట్టే చర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య కొన్ని గంట‌ల పాటు ఘ‌ర్ష‌ణ వాతావరణం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల పాటు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.
 
అరుణాచ‌ల్ సెక్టార్‌లో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న గురించి మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది. శాంతి మంత్రం జ‌పిస్తూనే ఇప్పుడు తూర్పు ల‌డ‌ఖ్‌తో పాటు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సెక్టార్ వ‌ద్ద కూడా చైనా ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.
 
భారత బలగాలు సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా 200 మంది చైనా సైనికులు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపానికి రావడాన్ని గుర్తించారు. వీరు ఎల్ఐసీని దాటేందుకు ప్రయత్నించగా భారత్ సైన్యం అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య కొన్ని గంటల పాటు ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు వాస్తవాధీన రేక నుంచి వెనక్కి వెళ్లిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments