ఫోర్బ్స్ 2021 రిచ్‌లిస్ట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ మళ్లీ టాప్‌లో నిలిచారు. 2008 నుంచి ఆయన నెంబర్ వన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈయన మొత్తం సంపద 92.7 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్ ప్రకటించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఫోర్బ్స్ రిచ్‌లిస్ట్‌లోని టాప్ 100 మంది సంపద 775 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది.
గత యేడాదితో పోల్చితే 257 బిలియన్ డాలర్లు పెరిగిందని తెలిపింది. సుమారు 61 మంది బిలియనీర్లు తమ సంపదకు కనీసం ఒక బిలియన్ డాలర్లను యాడ్ చేసుకోగలిగారని ఫోర్బ్స్ పేర్కొంది. రిచ్‌లిస్ట్‌లోని 80 శాతం మంది సంపద పెరిగిందని తెలిపింది. గత ఏడాది కాలంలో అంబానీ సంపద 4 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఈ రిచ్‌లిస్టులో రెండో స్థానంలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపద 74.8 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది కాలంలో ఫోర్బ్స్ రిచ్ లిస్టులోని ఇతర బిలియనీర్ల కంటే అదానీ సంపద 200 శాతం పెరిగింది. అంటే ఆయన సంపద ఒక్క ఏడాదిలోనే 49.5 బిలియన్ డాలర్లు ఎగిసింది. ముఖ్యంగా, ఈయన సంపద భారత్‌లో కరోనా కష్టకాలంలోనే పెరిగింది.