Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాస్టిక్ యముడు.. డాల్ఫిన్ పొట్టలో పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలే

Webdunia
మంగళవారం, 28 మే 2019 (11:59 IST)
మనుషులు తయారు చేసుకున్న ప్లాస్టిక్ ఇప్పుడు మనిషి మనుగడకే సవాలు విసురుతోంది. ప్లాస్టిక్ భూతం మానవాళి మనుడగకే కాదు భూమిపై అన్ని జీవుల మనుగడను కూడా ప్రశ్నార్థంగా మార్చేస్తోంది. మరోవైపు నిత్యం వేల టన్నుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయి. 
 
ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భారీ మొత్తంలో సముద్రాల్లో కలవడంతో ఆహార వేటలో ఉండే జలచరాలు వాటిని ఆహారంగా తీసుకోవడంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నాయి.

సముద్రాల్లో కలిసే ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఇప్పటికే చాలా జీవులు నశించాయని, మరికొన్ని జీవులు నశించే దశలో ఉన్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నీటిలో కలవడం ఇలాగే కొనసాగితే జలచరాల మనుగడ ప్రశ్నార్థం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
 
తాజాగా ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ బీచ్‌ ఒడ్డున చనిపోయిన డాల్ఫిన్‌ కళేబరం కొట్టుకు వచ్చింది. ఆ డాల్ఫిన్ కళేబరాన్ని కోయగా శవపరీక్ష చేసిన వారికి దాని పొట్టలో పూర్తిగా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపించాయి.

అలాగే రెండు అడుగుల ప్లాస్టిక్ షవర్ గొట్టం కూడా ఉండడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమీషన్ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. 
 
నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటనగా అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 23వ తేదీన కూడా ఓ చిన్న డాల్ఫిన్ ఇలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో చనిపోయి ఒడ్డుకు కొట్టుకువచ్చిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments