Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యాన్ సునామీ.. ఓటమి దిశగా నారా లోకేశ్

Advertiesment
Andhra Pradesh Election Results
, గురువారం, 23 మే 2019 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్యాన్ సునామీ సృష్టించింది. ఆ దెబ్బకు అధికార తెలుగుదేశం అభ్యర్థులు కొట్టుకునిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మంత్రులందరూ ఓటమిని చవిచూడనున్నారు. ఒకానొక దశలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం వెనుకబడి.. ఆ తర్వాత పుంజుకున్నారు.
 
అదేవిధంగా ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సైతం ఓటమి దిశగా పయనిస్తున్నారు. మంగళవారం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న లోకేశ్... వైకాపా ఆభ్యర్థి ఆళ్ళ రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోనున్నారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 
 
మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎలీజా తొలి విజయం నమోదు చేయగా.. విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి, కృష్ణా జిల్లా పెడనలో జోగి రమేశ్‌, మచిలీపట్నంలో పేర్ని నాని, చిత్తూరు జిల్లా మదనపల్లిలో నవాబ్‌ బాషాలు విజయం సాధించారు. 
 
గురువారం వెల్లడవుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఇప్పటివకరు 9 స్థానాల్లో విజయం సాధించగా, మరో 144 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. అధికార టీడీపీ మాత్రం 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
ఇదిలావుండగా, చిత్తూరు జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఈ జిల్లాలో వైకాపా తిరుగులేని ప్రభంజనం సృష్టించనుంది. 14 అసెంబ్లీ స్థానాల్లో 13 చోట్ల కొనసాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మూడో రౌండ్ ముగిసేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందజలో ఉన్నారు. తంబల్లపల్లి వైఎస్సాసీపీ అభ్యర్థి ద్వారాకనాథ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సత్యవేడు, నగరిలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

AP Assembly 2019 Live results - YSRCP -144 / TDP-26, వైసీపీ 4 విజయం