Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

#Verdict2019 : ఏపీలో గెలిచేది ఎవరు? ఓడిపోయేది ఎవరు?

Advertiesment
Andhra Pradesh Assembly Election Results 2019 LIVE
, గురువారం, 23 మే 2019 (06:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచేది ఎవరు? ఓడిపోయేది ఎవరు? అధికార పీఠాన్ని కైవసం చేసుకొనేది ఎవరు? మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారా? సీఎం కావాలని అనుకుంటున్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కలలు నిజమౌతాయా? కింగ్ మేకర్ అవుతానని అన్న జనసేనానీని ప్రజలు ఆశీర్వదించారా? ఇలాంటి ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. ఏపీ శాసనసభతో పాటు.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది.
 
మధ్యాహ్నం 12 గంటల లోపు ఫలితాల ట్రెండ్స్‌ తెలిసిపోనున్నాయి. తొలుత వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటించనున్నారు. ఒకవేళ ఈవీఎంలలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే.. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిటన్లు.. 350 లెక్కింపు హాళ్లున్నయి. అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు, పార్లమెంట్ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుంది. 
 
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మందును బంద్ చేశారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచే వాహనాలను అనుమతించమన్నారు. మొత్తం 25వేల మంది పోలీసు బలగాలు, 35 కంపెనీల సీపీఎంఎఫ్‌ బలగాలను భద్రత పర్యవేక్షిస్తుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#ElectionResults2019 : టిక్.. టిక్.. టిక్... తొలి ఫలితం నర్సాపూర్.. చిట్టచివరన రాజమండ్రి