Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్‌‌ కేసులో పాకిస్థాన్ అలా చేస్తోంది..

Webdunia
గురువారం, 23 జులై 2020 (22:35 IST)
భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిలిటరీ కోర్టు తీర్పుపై అపీలు చేయవలసి ఉంది. అయితే ఈ కేసులో చట్టపరమైన అన్ని అవకాశాలను పాకిస్థాన్ అడ్డుకుంటోందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జూలై 16న భారత దేశ కాన్సులర్ ఆఫీసర్లు జాదవ్‌ను కలిసినపుడు పాకిస్థాన్ అధికారులు అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ కేసు పట్ల పాకిస్థాన్ వ్యవహార శైలి ఓ ప్రహసనంగా ఉందని పేర్కొన్నారు. జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీ తీసుకోవడానికి సైతం భారత దేశానికి అవకాశం ఇవ్వలేదన్నారు.
 
జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీని తీసుకోలేకపోవడం వల్ల మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని ఈ కేసులో భారత్ తరపున వాదిస్తున్న పాకిస్థానీ లాయర్ చెప్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి అనుసరించదగిన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments