కరోనా విజృంభిస్తున్న వేళ ఆసియా కప్ 2020ని వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. అయితే దీనికంటే ముందే ఒక రోజు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. దీంతో గంగూలీ పైన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
గంగూలీ తన పవర్ చూపించడానికి మాత్రమే ఏసీసీ కంటే ముందు ఆసియా కప్ రద్దు విషయాన్ని వెల్లడించాడని రషీద్ లతీప్ విమర్శించాడు. ఆసియా కప్ ఈ ఏడాది నిర్వహించాలా లేదా రద్దు చేయాలో నిర్ణయించాల్సింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ గానీ సౌరవ్ గంగూలీ మితిమీరిన బలం చూపించడం ద్వారా ఆసియా క్రికెట్ దేశాల్ని హర్ట్ చేశాడు.
అతడు భారత క్రికెట్ ఐపీఎల్ పైన శ్రద్ధ పెడితే మంచిదని రషీద్ లతీఫ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ వ్యాఖ్యలపై గంగూలీ రిటర్న్ స్ట్రోక్ ఏమిటో చూద్దాం.