Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ మంత్రివర్గంలో కాశ్మీర్ ఉగ్రవాది భార్యకు చోటు - కేబినెట్ హోదా!

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (14:33 IST)
పాకిస్థాన్ మంత్రివర్గంలో కాశ్మీర్ ఉగ్రవాది భార్యకు చోటు కల్పించారు. ఆమెకు ఏకంగా కేబినెట్ హోదాను ఇచ్చారు. ఈమె కాశ్మీర్‌లో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిన తీవ్రవాది యాసిన్ మాలిక్‌ భార్య కావడం విశేషం. పేరు ముషాల్ హుస్సేన్ ముల్లిక్. పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని సలహాదారురాలిగా ఆమెను నియమించి, ఏకంగా జూనియర్ మినిస్టర్ హోదాను కట్టబెట్టారు. దీంతో టెర్రరిస్టు భార్య ముల్లిక్.. పాకిస్థాన్‌లో మానవ హక్కులు, మహిళా సాధికారత తదితర అంశాల్లో పాక్ దేశ ప్రధానికి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. 
 
పాకిస్థాన్ దేశంలో ప్రభుత్వం అన్వర్ ఉల్ హక్ కాకర్ సారథ్యంలో ఆపద్ధర్మ ప్రబుత్వం ఏర్పాటైంది. ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ ఇటీవల పాకిస్థాన్ పార్లమెంటు‌ను రద్దు చేయడంతో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటైంది. 90 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేంత వరకు ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. అప్పటివరకు ముల్లిక్ పాక్ కేబినెట్ హోదాలో కొనసాగుతారు. 
 
మరోవైపు, ఉగ్రవాదులకు నిధుల సమీకరణ కేసులో యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కానీ, ఎన్.ఐ.ఏ మాత్రం మరణశిక్ష విధించాలంటూ వాదిస్తుంది. ఈ కేసులో ఈ నెల 9వ తేదీన వీడియో లింక్ ద్వారా యాసిన్ మాలిక్ కోర్టు విచారణకు హాజరయ్యారు. టెర్రిరిస్ట్ అయిన మాలిక్.. గత 2009లో ముల్లిక్‌ను వివాహం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments