Webdunia - Bharat's app for daily news and videos

Install App

విస్తారా ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (13:41 IST)
విస్తారా ఎయిర్‌లైన్స్‌‍కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి పుణె బయల్దేరిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో బాంబు ఉందంటూ ఫోన్‌ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానం మొత్తం తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్దారించుకున్న తర్వాత విమానం ఆలస్యంగా బయల్దేరినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. 
 
'ఈ రోజు ఉదయం దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఉన్న జీఎంఆర్‌ కాల్‌ సెంటర్‌కు ఢిల్లీ - పుణె విస్తారా విమానంలో బాంబు ఉందని ఫోన్‌ వచ్చింది. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌ చేశాం. భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబును గుర్తించలేదు' అని విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీనిపై విమానాశ్రయ సిబ్బంది దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments